Man kills wife: భార్యను చంపి పోలీసులకే కాల్ చేశాడు-man kills wife in delhi later confess crime on call ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Kills Wife In Delhi Later Confess Crime On Call

Man kills wife: భార్యను చంపి పోలీసులకే కాల్ చేశాడు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2022 06:48 AM IST

Man kills wife: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి భార్యను హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు.

Man kills wife
Man kills wife

Man kills wife: దేశంలో నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఢిల్లీలో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి పోలీసులకే ఫోన్ చేశాడు. తానే చంపినట్టు కాల్ ద్వారానే అంగీకరించాడు. ఢిల్లీలోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 35 సంవత్సరాల ఓ వ్యక్తి.. తన భార్యను గొంతు నులిమి చంపాడు.

ట్రెండింగ్ వార్తలు

యోగేశ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్‍కు కాల్ చేశాడు. తన భార్యను హత్య చేశానని చెప్పుకొచ్చాడు. సుశీలా గార్డెన్‍లోని ఇంట్లో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు యోగేశ్ భార్య అర్చనా స్పృహ కోల్పోయి ఉంది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Man kills wife: ఆర్థిక కారణాలతో..

భార్యను హత్య చేసినట్టు అంగీకరించిన యోగేశ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యోగేశ్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో అర్చనా.. చాలా చోట్ల అప్పులు చేసిందని గుర్తించారు. ఈ విషయంలోనే ఆదివారం రోజున యోగేశ్, అర్చన మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. వాదన జరిగిన ఈ క్రమంలో అర్చన గొంతును యోగేశ్ నులిమాడు. దీంతో ఆమె మృతి చెందింది.

కాగా, ఢిల్లీకి ఓ యువతి ఇటీవల తండ్రి చేతుల్లోనే హత్యకు గురైంది. కూతురు ఆయుషీ తనకు చెప్పకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన ఆ తండ్రి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత మృత దేహాన్ని సూట్ కేస్‍లో పెట్టి మథుర సమీపంలోని యుమానా ఎక్స్ ప్రెస్ వే పక్కన పడేశాడు. ఈ కేసును ఛేదించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూడా కలకలం రేపింది.

IPL_Entry_Point

టాపిక్