Man kills wife over extra marital affair : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన భార్య-బిడ్డని కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. ఇంట్లో దొంగలు పడి, తన కుటుంబాన్ని చంపేసినట్టు డ్రామా చేశాడు. చివరికి.. పోలీసులకు చిక్కాడు!
ఉత్తర్ ప్రదేశ్ లలిత్పూర్ జిల్లాలోని చండ్మరి ప్రాంతంలో జనవరి 7 అర్థరాత్రి సమయంలో జరిగింది ఈ ఘటన. స్థానికంగా నివాసముంటున్న నీరజ్ కుష్వాహా వయస్సు 27ఏళ్లు. 22ఏళ్ల మనీషతో కొన్నేళ్ల క్రితం అతనికి పెళ్లైంది. వారికి ఒక ఆడబిడ్డ కూడా ఉంది.
Man kills wife Uttar Pradesh : కాగా.. నీరజ్‌కు వివాహేత సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. జనవరి 7న కూడా పెద్ద గొడవే జరిగింది. చివరికి.. అది హత్యకు దారి తీసింది.
భార్యతో గొడవ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన నీరజ్.. విక్షణారహితంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఉన్న ఓ బ్యాట్‌ని తీసుకుని, ఆమె తలపై అనేక మార్లు బలంగా కొట్టాడు. ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొంతేపటికి.. తన బిడ్డను.. గొంతు నులిమి చంపేశాడు నీరజ్. ఊపిరి ఆడక.. ఆమె విలవిలలాడుతు ప్రాణాలు కోల్పోయింది.
Uttar Pradesh crime news : భార్యబిడ్డలను చంపేసిన తర్వాత.. నీరజ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి? అని ఆలోచిస్తుండగా.. ఒక ఆలోచన తట్టింది. వెంటనే, బ్యాట్‌తో తన తల పగలగొట్టుకున్నాడు నీరజ్. ఆ తర్వాత, ఇంట్లోని వస్తువులను నేల మీద పడేశాడు. ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలను దాచేశాడు. అనంతరం.. తన ఇంట్లో దొంగలు పడ్డారని, భార్యాబిడ్డలను చంపేసి, బంగారన్ని లూటీ చేశారని పోలీసులకు చెప్పాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. భారీ బలగంతో ఘటనాస్థలానికి వెళ్లారు. నీరజ్ నుంచి ఫిర్యాదు తీసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం వాటిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Man kills wife : అయితే.. నీరజ్ చెప్పిన దానికి పోలీసులకు ఆధారాలు లభించలేదు. అదే సమయంలో స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. అసలు దొంగల జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. పోలీసులకు నీరజ్‌పై అనుమానం మొదలైంది. వెంటనే అతని ఇంటికి వెళ్లి, సోదాలు నిర్వహించారు. టీవీ వెనుక ఉన్న బంగారం ఆభరణాలను గుర్తించారు.
అదే సమయంలో.. మహిళ బంధువులు అక్కడికి చేరుకున్నారు. నీరజ్ తమ బిడ్డను చాలాసార్లు చిత్రహింసలకు గురిచేశాడని, కట్నం కోసం ఒత్తిడి చేశాడని పోలీసులకు వివరించారు. చివరికి.. పోలీసులు నీరజ్‌ని అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా.. నీరజ్, నిజాన్ని అంగీకరించాడు. వివాహేతర సంబంధంపై గొడవ జరగడంతో భార్యను బిడ్డను చంపేశానని పోలీసులకు చెప్పాడు.
ఈ కేసును కేవలం 4 గంటల్లోనే ఛేదించినట్టు పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం