Man kills girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని.. గర్ల్​ఫ్రెండ్​ని 15సార్లు పొడిచి చంపిన​ క్యాబ్​ డ్రైవర్​!-man in bengaluru kills his girlfriend by stabbing her 15 times report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని.. గర్ల్​ఫ్రెండ్​ని 15సార్లు పొడిచి చంపిన​ క్యాబ్​ డ్రైవర్​!

Man kills girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని.. గర్ల్​ఫ్రెండ్​ని 15సార్లు పొడిచి చంపిన​ క్యాబ్​ డ్రైవర్​!

Sharath Chitturi HT Telugu
Apr 01, 2024 05:20 PM IST

Bengaluru crime news : పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో.. ఓ మహిళను ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బెంగళూరులో జరిగింది ఈ ఘటన.

గర్ల్​ఫ్రెండ్​ని 15సార్లు పొడిచి చంపిన క్యాబ్​ డ్రైవర్​..!
గర్ల్​ఫ్రెండ్​ని 15సార్లు పొడిచి చంపిన క్యాబ్​ డ్రైవర్​..!

Man kills girlfriend in Bengaluru : కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కారణంతో.. తన 42ఏళ్ల గర్ల్​ఫ్రెండ్​ని కిరాతకంగా హత్య చేశాడు ఓ 35ఏళ్ల క్యాబ్​ డ్రైవర్​. అనంతరం.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

బెంగళూరులోని జయానగర్​లో నివాసముంటున్నాడు గిరీశ్​. అతను ఒక క్యాబ్​ డ్రైవర్​. 42ఏళ్ల ఫరిదా ఖతున్​ అనే మహిళతో అతనికి కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆమె పశ్చిమ్​ బెంగాల్​వాసి. బెంగళూరులోని ఓ స్పాలో పనిచేస్తోంది.

కాగా.. చెల్లికి సంబంధాలు రావడం లేదన్న కారణంతో.. 2011లోనే గిరీశ్​.. ఇస్లాం మతంలోకి మారాడు. తన ఒరిజినల్​ పేరును అలాగే ఉంచుకున్నాడు.

Bengaluru crime news : ఫరిదాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ్​ బెంగాల్​కి వెళ్లిన ఫరిదా.. మార్చ్​ 26న తిరిగొచ్చింది. మార్చ్​ 29న.. గిరీశ్​ పుట్టున రోజును జరపాలని నిర్ణయించుకుంది. కూతురి కాలేజ్​ అడ్మిషన్​ కోసం ప్రయత్నిస్తూ.. మార్చ్​ 29న గిరీశ్​ బర్త్​డేని సెలబ్రేట్​ చేసింది.

శనివారం.. ఫరిదా, ఆమె కూతుళ్లతో షాపింగ్​, లంచ్​కి వెళ్లాడు గిరీశ్​. అనంతరం హోటల్​కి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం.. గిరీశ్​, ఫరిదాలు షాలినీ గ్రౌండ్స్​కి వెళ్లారు. తనని పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడు గిరీశ్​. కానీ అందుకు ఫరిదా ఒప్పుకోలేదు.

పెళ్లి ప్రపోజల్​ విషయం అది కొత్తేమీ కాదు! గతంలో కూడా చాలాసార్లు.. తనని పెళ్లి చేసుకోవాలని అడిగాడు గిరీశ్​. ఆమె ఎప్పుడు ఒప్పుకోలేదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.

శనివారం కూడా.. పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకోలేదు ఫరిదా. కోపంతో ఊగిపోయిన గిరీశ్​.. ఆమెను 15సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. అనంతరం జయానగర్​ పోలీస్​ స్టేషన్​కి వెళ్లి లొంగిపోయాడు.

Bengaluru man kills girlfriend : ఇంతలో.. షాలినీ గ్రౌండస్​లో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉందన్న విషయం పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి వెళ్లేసరికి.. ఫరిదా మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడిని విచారించారు. పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకోకపోవడంతో తన గర్ల్​ఫ్రెండ్​ని హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

Latest crime news : "ఘటనపై సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేసుకున్నాము. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్​మెంట్​ తీసుకున్నాము. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము," అని పోలీసులు అధికారులు వెల్లడించారు.

మరి.. తల్లి మరణంతో ఫరిదా ఇద్దరి కుమార్తెల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియరాలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.