Crime news : పెళ్లి జరిగిన 8వ రోజు.. కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి..!
Madhya Pradesh crime news : పెళ్లి జరిగిన 8వ రోజు.. భార్యతో సహా కుటుంబంలో 8మందిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
Man kills family members in Madhya Pradesh : మధ్యప్రదేశ్లో అత్యంత అమానవీయ, షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన కుటుంబంలోని 8మందిని గొడ్డలితో నరికి, నరికి చంపాడు! అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిందితుడికి.. 8 రోజుల క్రితమే పెళ్లవ్వడం గమనార్హం.

ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం అర్థరాత్రి జరిగింది ఈ ఘటన. అందరు నిద్రిస్తున్న సమయంలో.. నిందితుడు వారిపై గొడ్డలితో దాడి చేశాడు. తొలుత.. 8 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న తన 23ఏళ్ల భార్యను నరికి చంపేశాడు ఆ 23ఏళ్ల వ్యక్తి. అనంతరం.. బయటకు వచ్చి, కుటుంబంలోని మిగిలిన వారందరిని నరికి చంపేశాడు. మృతుల్లో తల్లి, సోదరి, వదినలతో పాటు 5,4, ఏడాది వయస్సు ఉన్న చిన్నారులు ఉన్నారు. మెడపై గొడ్డలితో నరికి చంపాడు. అర్థరాత్రి కావడంతో, అందరు నిద్రలో ఉండటంతో, ఎవరు ప్రతిఘటించలేదు.
అనంతరం.. అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలోని తన బంధువు ఇంటికి వెళ్లాడు ఆ నిందితుడు. అక్కడ పడుకుని ఉన్న 10ఏళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేశాడు. కానీ అతను సమయానికి నిద్ర నుంచి లేవడంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ గాయమైంది. గట్టిగా అరిచాడు. మిగిలిన వాళ్లు నిద్రలేచి, అతని వద్దకు పరుగులు తీశారు. ఇంతలో.. ఈ 23ఏళ్ల నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయడు.
Man kills family members with axe : కాగా.. ఘటనస్థలానికి 150 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఆ 23ఏళ్ల వ్యక్తి. మరుసటి రోజు ఉదయం, అతని మృతదేహం స్థానికులకు కనిపించింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. మృతదేహాలు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దాడికి ముందు.. నిందితుడు వారికి ఏదైనా మత్తు మందు ఇచ్చాడా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టగా.. 23ఏళ్ల వ్యక్తికి 8 రోజుల క్రితమే పెళ్లి జరిగిందని, కానీ ఏడాదిగా.. అతని మానసిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారు.
"ఆ కుటుంబం మొత్తం పేదరికంలో అలమటిస్తోంది. అతను కూలీగా పనిచేస్తాడు. ఏడాది క్రితం అతని మానసిక పరిస్థితి బాగోలేదు. చికిత్స తీసుకున్నాడు. ఆ వివరాలు అతని సోదరుడికి తెలుసు. కానీ.. ఇటీవలి కాలంలో అతనిలో ఎలాంటి మానసిక సమస్యలు కనిపించలేదు. యాక్టివ్గా ఉన్నాడు," అని నిందితుడి భార్య తండ్రి చెప్పుకొచ్చాడు.
Madhya Pradesh crime news : కాగా.. ఈ దారుణానికి ఒడిగట్టే 3,4 రోజుల ముందు నుంచే నిందితుడు గొడ్డలి పట్టుకుని ఊరంతా తిరిగాడు. కానీ ఎవరిపైనా దాడి చేయకపోవడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. చివరికి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు.
రాజకీయ దుమారం..
ఒకే కుటుంబంలోని 8మంది హత్యకు గురైన వార్తపై మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం చెలరేగింది. పేదరికం, నిరుద్యోగం కారణాల వల్లే ఈ ఘటన జరిగిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విమర్శించింది. 'మానసిక ఒత్తిడి పేరు చెప్పడం చాలా సులభం. కానీ ఈ ప్రాంతంలో ప్రజలు పేదరికం, నిరుద్యోగంతో అలమటిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలి,' అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారా తెలిపారు.
కాగా.. కాంగ్రెస్ మాటలను సీఎం యాదవ్ తిప్పికొట్టారు. ఇలాంటి ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మానసికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు.. నిందితుడికి ఎందుకు పెళ్లి చేశారో అర్థం కాలేదన్నారు.
సంబంధిత కథనం