American accent videos: అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారా?.. ఈ యువకుడి వీడియోలు చూడండి..-man from odisha takes social media by storm with his videos on american accent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  American Accent Videos: అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారా?.. ఈ యువకుడి వీడియోలు చూడండి..

American accent videos: అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారా?.. ఈ యువకుడి వీడియోలు చూడండి..

HT Telugu Desk HT Telugu
Jan 10, 2024 02:42 PM IST

American accent videos: ప్రస్తుతం ఇన్ స్టా లో ఈ ఒడిశా యువకుడి వీడియోలు తాజా సెన్సేషన్. ఇంగ్లీష్ ను అమెరికన్ యాక్సెంట్ లో ఎలా మాట్లాడాలో వివరిస్తూ, ఈ 21 ఏళ్ల యువకుడు పోస్ట్ చేసే వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

లేటెస్ట్ ఇన్ స్టా సెన్సేషన్ ధీరజ్ టక్రీ
లేటెస్ట్ ఇన్ స్టా సెన్సేషన్ ధీరజ్ టక్రీ (Instagram/@dhirajtakri)

American accent videos: ఒడిశాకు చెందిన 21 ఏళ్ల యువకుడు ధీరజ్ టక్రీ అమెరికన్ యాసపై తన ట్యుటోరియల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

yearly horoscope entry point

అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్

ఒడిశాకు చెందిన 21 ఏళ్ల ధీరజ్ టక్రీ క్రమం తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో అమెరికన్ యాసను ఎలా పెంపొందించుకోవచ్చో మాట్లాడే వీడియోలను షేర్ చేస్తుంటాడు. తన ట్యుటోరియల్ వీడియోలతో సోషల్ మీడియాలో అతడు లేటెస్ట్ సెన్సేషన్ గా మారాడు. అమెరికన్ యాసతో ఎలా మాట్లాడాలో ఇతరులకు నేర్పడానికి అతను క్రమం తప్పకుండా వీడియో క్లిప్స్ ను పంచుకుంటాడు. ధీరజ్ టక్రీ వీడియోలకు లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లు వస్తుంటాయి.

ఫన్నీ వే లో..

21 ఏళ్ల ధీరజ్ టక్రీ ఇన్ స్టా గ్రామ్ బయోలో 'విదేశాలకు వెళ్లకుండా స్థానికుల్లా ఇంగ్లిష్ మాట్లాడండి' అని ఉంటుంది. మొదట, అమెరికన్ యాసతో కొన్ని ఇంగ్లీష్ పదాలను ఎలా ఉచ్చరించాలో తెలియజేస్తూ కొన్ని వీడియోలను ధీరజ్ షేర్ చేశాడు. వాటికి మంచి స్పందన లభించింది. దాంతో, అతడు క్రమం తప్పకుండా అటువంటి వీడియోలను రూపొందించి, తన ఇన్ స్టాలో షేర్ చేయడం ప్రారంభించాడు. తన వీడియోలకు వెబ్ సిరీస్ లు లేదా టెలివిజన్ షోల స్నిప్పెట్లను జోడించడం ద్వారా అతను తన వీడియోలను సరదాగా మారుస్తాడు. ఈ వీడియో 1.4 కోట్లకు పైగా వ్యూస్ తో వైరల్ అయింది. ఈ క్లిప్ లో టక్రీ అమెరికన్ ఇంగ్లిష్ లో 'ఇంగ్ (ing)' అనే పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తారో వివరించారు.

మంచి రెస్పాన్స్

ఇంగ్లీష్ లో మాట్లాడే సమయంలో వ్యాకరణాన్ని ఎలా విస్మరిస్తారో వివరిస్తూ మరో వీడియోను ధీరజ్ షేర్ చేశారు. ఈ వీడియోకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఆయన అభిప్రాయం పట్ల కొందరు సంతృప్తి చెందకపోగా, మరికొందరు అర్థవంతంగా ఉందని అన్నారు. ధీరజ్ వీడియోలకు ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. కామెంట్స్ సెక్షన్ లో అమె ఆ వీడియోను ప్రశంసిస్తూ కామెంట్ చేశారు.

ఈ ఇన్ స్టాగ్రామ్ పేజీని ఎందుకు ప్రారంభించాడు?

తన గురించి వివరించడానికి టక్రీ ఇన్స్టాగ్రామ్ లో ఒక బ్లాగ్ లింక్ ను కూడా పంచుకున్నారు. ‘‘ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అయ్యేలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. స్కూల్ లో ఇవన్నీ నేర్పించరు. కాబట్టి నేను ఇతరులకు సహాయం చేయడానికి ఒక ఛానెల్ ను ప్రారంభించాను’’ అని వివరించారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.