Crime news : ప్రైవేట్​ వీడియోతో బెదిరించి- స్నేహితులతో యువతిని రేప్​ చేయించిన బాయ్​ఫ్రెండ్​!-man films private moments with girlfriend uses it to rape her with 5 friends ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ప్రైవేట్​ వీడియోతో బెదిరించి- స్నేహితులతో యువతిని రేప్​ చేయించిన బాయ్​ఫ్రెండ్​!

Crime news : ప్రైవేట్​ వీడియోతో బెదిరించి- స్నేహితులతో యువతిని రేప్​ చేయించిన బాయ్​ఫ్రెండ్​!

Sharath Chitturi HT Telugu
Nov 12, 2024 06:35 AM IST

Odisha rape case : బాయ్​ఫ్రెండ్​తో ఆమె సన్నిహితంగా ఉంది. వారి మధ్య జరిగిన వాటిని ఆ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని, తన స్నేహితులతో కలిసి యువతిని గ్యాంగ్​ రేప్​ చేశాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది..

యువతిపై సామూహిక అత్యాచారం!
యువతిపై సామూహిక అత్యాచారం!

ఒడిశాలోని కటక్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ప్రైవేట్​ వీడియోని చూపించి ఓ యువతిని, ఆమె బాయ్​ఫ్రెండ్​ బెదిరించాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఓ మైనర్ సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..

బాయ్​ఫ్రెండ్​తో పాటు మరో ఐదుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు కటక్​లోని బాదంబాడి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలి బాయ్​ఫ్రెండ్.. వారి ప్రైవేట్ వీడియోను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేశాడు!

దసరా పండుగ సందర్భంగా కటక్​లోని ఓ కేఫ్​కు వెళ్లిన సమయంలో తాము సన్నిహితంగా ఉన్న క్షణాలను అతను వీడియో తీశాడని బాధితురాలు పేర్కొంది. ఇందుకు కేఫ్​ యజమాని సహకరించాడని పేర్కొంది. అనంతరం ఆ బాయ్​ఫ్రెండ్​, అతని స్నేహితులు.. ఆ సన్నిహిత వీడియోలను చూపించి యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వివరాలను కటక్ డీసీపీ జగ్మోహన్ మీనా తెలిపారు.

మైనర్ సహా ఆరుగురి అరెస్ట్​..

నవంబర్ 4న ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి ప్రియుడు, కేఫ్ యజమాని, ఓ బాలుడు, మరో ముగ్గురిని.. రెండు రోజుల్లోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి, బీఎన్​ఎస్, ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలు, ఆమె బాయ్​ఫ్రెండ్ ప్రైవేట్ వీడియోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొబైల్​ ఫోన్ల్​ను.. భువనేశ్వర్​లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పరీక్ష కోసం పంపిన పోలీసులు, వాటి నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు బాధితురాలిపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని మీనా మీడియా సమావేశంలో చెప్పారు. బ్లాక్​మెయిల్​కు గురవుతున్న యువతులు ఎవరైనా భయం, సంకోచం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు తాజా కేసునే ఉదాహరణంగా చూపుతున్నారు.

మరోవైపు, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ భువనేశ్వర్​లో అన్నారు.

2036 నాటికి ఒడిశాను మహిళలకు నేర రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం