Man Elopes with Daughter-In-Law: కుమారుడి భార్యను ప్రేమించిన వ్యక్తి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి..
Man Elopes with Daughter-In-Law: కోడలిని ప్రేమించిన ఓ వ్యక్తి ఆమెను ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. భర్త, ఆరు నెలల కూతురిని విడిచిపెట్టి ఆమె తన మామతో వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఆ వ్యక్తి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Man Elopes with Daughter-In-Law: సొంత కుమారుడి భార్యనే ఓ వ్యక్తి ప్రేమించాడు. కోడలిని ఇష్టపడ్డాడు. ఆ ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆరు నెలల కూతురు ఉన్న ఆమె.. మామతో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్ (Rajasthan) లోని బుండీ (Bundi) జిల్లాలో ఆ అనూహ్య ఘటన జరిగింది. వివరాలివే..
బైక్‍తో పాటు..
Man Elopes with Daughter-In-Law: బుండీ జిల్లా సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిలోర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పవన్ వైరాగీ అనే వ్యక్తి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రమేశ్ వైరాగీ తన భార్యను తీసుకెళ్లాడని కంప్లైట్ చేశాడు. తన భార్యతో పాటు బైక్‍ను కూడా ఎత్తుకెళ్లాడనే ఆరోపణలతో ఫిర్యాదు చేశాడు.
తన భార్య అమాయకురాలు అని, తన తండ్రి ఆమెను మోసం చేసి ఉంటాడని పవన్ చెప్పాడు. ఉద్యోగరీత్యా తాను ఎక్కువ కాలం గ్రామానికి దూరంగానే ఉండాల్సి వస్తుందని అన్నాడు.
Man Elopes with Daughter-In-Law: అయితే, పోలీసులు తన ఫిర్యాదును సీరియస్‍గా తీసుకోవడం లేదని పవన్ చెప్పాడు. దీనిపై సర్దార్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ భరద్వాజ్ స్పందించారు. అన్ని కోణాల నుంచి తీవ్రంగా ఈ కేసు విచారణ జరుపుతున్నామని అన్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నామని, బైక్‍తో పాటు వారిని పట్టుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికైతే ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నారో ఇంకా గుర్తించలేదని చెప్పారు.
ఈ ఏడాది జనవరిలోనూ ఇలాంటి ఘటనే రాజస్థాన్‍లో సిరోహి జిల్లాలో జరిగింది. 40 ఏళ్ల వయసు ఉన్న ఓ అత్త.. తన అల్లుడిని ప్రేమించి.. అతడితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వెళ్లిపోయే ముందు మామకు ఆ అల్లుడు మద్యం పార్టీ ఇచ్చాడు. మామ పూర్తిగా మత్తులోకి వెళ్లాక అత్తతో కలిసి అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.