Man Kills wife: కిరాతకం: భార్యను చంపి ముక్కలుగా చేసిన వ్యక్తి.. వాటర్ ట్యాంకులో..
Man Kills wife: భార్యను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. శరీర భాగాలను వాటర్ ట్యాంకులో దాచాడు. ఘటన జరిగిన నెల ఈ విషయం బయటికి వచ్చింది.
Man Kills Wife: శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు లాంటి ఘటన మరొకటి జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపేసి ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత శరీర భాగాలను తన ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో దాచాడు. ఛత్తీస్‍గఢ్ (Chhattisgarh)లోని బిలాస్‍పూర్(Bilaspur)లో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాలను పోలీసులు వెల్లడించారు.
ఎలా బయటికి వచ్చిందంటే..
Man Kills Wife: బిలాస్‍పూర్ పరిధిలోని ఉస్లాపూర్ (Uslapur) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి.. ఆ భాగాలను వాటర్ ట్యాంకులో దాచాడు. అయితే, ఈ ఘటన నెల రోజుల కంటే ముందే జరిగింది. అయితే, నిందితుడి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇటీవలే అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సక్రి స్టేషన్‍కు చెందిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.
Man Kills Wife : వాటర్ ట్యాంకులో మహిళల శరీర భాగాలను పోలీసులు ఆదివారం రాత్రి గుర్తించారు. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. నెల నుంచి 2 నెలల క్రితమే ఈ హత్య జరిగి ఉండొచ్చని తమ ప్రాథమిక విచారణ తేలిందని, పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలను తెలుస్తాయని చెప్పారు. హత్యకు గురైన మహిళను సతీ సాహుగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త పవన్ ఠాకూర్ ఈ హత్యకు పాల్పడినట్టు భావిస్తున్నట్టు వెల్లడించారు.
Man Kills Wife : భార్యను చంపిన ఠాకూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు, పోలీసులు సంఘటన స్థలంలో క్లూస్ సేకరించారు. అన్ని కోణాల నుంచి ఈ కేసును విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసు
Shraddha Walkar Murder Case: గతేడాది జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లివిన్ పార్ట్‌నర్ అయిన ఆఫ్తాబ్ పునావాలా.. శ్రద్ధను కిరాతకంగా చంపి శరీరాన్ని 32 ముక్కలుగా చేశాడు. శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో దాచి కొన్ని రోజుల పాటు దాచి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. గతేడాది మేలో ఢిల్లీలో ఈ ఘటన జరగగా.. నవంబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు గురించి ఎన్నో విస్తుగొలిపే నిజాలు క్రమంగా వెల్లడయ్యాయి. ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు ఏకంగా 6,000కుపైగా పేజీల చార్జ్ షీట్ నమోదు చేశారు. 100కుపైగా ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం పూనావాలా.. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు.
సంబంధిత కథనం