Crime news : క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. ప్లేయర్​ని బ్యాట్​తో కొట్టి చంపి..!-man bludgeoned to death with bat after argument during cricket match ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Man Bludgeoned To Death With Bat After Argument During Cricket Match

Crime news : క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. ప్లేయర్​ని బ్యాట్​తో కొట్టి చంపి..!

Sharath Chitturi HT Telugu
Nov 07, 2023 08:06 AM IST

Mumbai Crime news : క్రికెట్​ మ్యాచ్​ సందర్భంగా జరిగిన ఓ గొడవ.. ఓ వ్యక్తి హత్యకు దారితీసింది! ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టించింది.

క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. ప్లేయర్​ని బ్యాట్​తో కొట్టి చంపి..!
క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. ప్లేయర్​ని బ్యాట్​తో కొట్టి చంపి..!

Mumbai Crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్​ మ్యాచ్​ సందర్భంగా మొదలైన ఓ గొడవ.. ఓ వ్యక్తి హత్యకు దారితీసింది! ఆపోజిట్​ టీమ్​ సభ్యుడిని, ఓ వ్యక్తి.. తన బ్యాట్​తో కొట్టి చంపేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ముంబైకి 800 కిలోమీటర్ల దూరంలోని భందారాలో ఉన్న చిఖలి అనే గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. అందరు కలిసి క్రికెట్​ ఆడుకున్నారు. అందులో 24ఏళ్ల నివ్రుట్టినాథ్​ కావలే, కరణ్​ బిలావ్నేలు కూడా పాల్గొన్నారు. ఇద్దరు వేరువేరు టీమ్స్​లో సభ్యులుగా ఉన్నారు.

కాగా.. ఎలా మొదలైందో తెలియదు కానీ.. ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన కరణ్​.. కావలేని తన బ్యాట్​తో కొట్టడం మొదలుపెట్టాడు. చివరికి.. కరణ్​ ప్రాణాలు కోల్పోయాడు.

Cricket match fight : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు.

"కరణ్​ టీమ్​ వరుసగా 3 మ్యాచ్​లు ఓడిపోయింది. ఆ తర్వత.. కావలేకు కరణ్​కు మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు తిట్టుకున్నారు. కరణ్​, తన కోపాన్ని కంట్రోల్​ చేసుకోలేకపోయాడు. చివరికి.. తన బ్యాట్​తో కావలేని కొట్టడం మొదలుపెట్టాడు. మెడ మీద బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కావలేని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు," అని పోలీసులు వెల్లడించారు.

Man kills youth with cricket bat : మరోవైపు నిందితుడు కరణ్​ని పోలీసులు అరెస్ట్​ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. ఓ వ్యక్తి హత్యకు దారితీసిందన్న వార్త సర్వత్రా చర్చకు దారితీసింది.

దిల్లీలో దారుణం..

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియక.. చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారు. ఓ మైనర్​ బాలుడు హత్యకు గురైన ఘటన తాజాగా దిల్లీలో కలకలం సృష్టించింది. పోలీసులు సమాచారం ప్రకారం.. రఘుబీర్​ నగర్​లో సోమవారం సాయంత్రం 6:45 గంటలకు జరిగింది ఈ ఘటన.

Delhi crime news : "రాత్రి 7 గంటలకు మాకు కాల్​ వచ్చింది. ఓ 17ఏళ్ల బాలుడుపై కత్తి దాడి జరిగిందని, అతను ప్రాణాలు కోల్పోయాడని తెలిసింది. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిని ఎవరు చంపారు? అన్న విషయంపై క్లారిటీ లేదు. కొందరు అనుమానితులను పట్టుకున్నాము. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాము," అని పోలీసులు వెల్లడించారు.

WhatsApp channel

సంబంధిత కథనం