Man kills wife : బెడ్​ మీద మలవిసర్జన చేసిందని.. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చంపిన భర్త!-man beats ailing wife to death in ups saharanpur arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Wife : బెడ్​ మీద మలవిసర్జన చేసిందని.. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చంపిన భర్త!

Man kills wife : బెడ్​ మీద మలవిసర్జన చేసిందని.. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చంపిన భర్త!

Sharath Chitturi HT Telugu
Sep 16, 2023 07:53 AM IST

Man kills wife : అనారోగ్యంతో బాధపడుతున్న భార్య.. మంచం మీద మలవిసర్జన చేసిందన్న కారణంతో, ఆమెను చంపేశాడు ఓ వ్యక్తి. యూపీలో జరిగింది ఈ ఘటన.

బెడ్​ మీద మలవిసర్జన చేసిందని.. భార్యను చంపిన భర్త!
బెడ్​ మీద మలవిసర్జన చేసిందని.. భార్యను చంపిన భర్త!

Man kills wife in Uttar Pradesh : ఉత్తర్​ ప్రదేశ్​లో ఘోరం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే.. ఆమెను కడతేర్చాడు! బెడ్​ మీద మలవిసర్జన చేసిందన్న కారణంతో.. కోపం తెచ్చుకుని చంపేశాడు!

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ సహరణ్​పూర్​లో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు సందీప్​. అతని వయస్సు 30ఏళ్లు. బాధితురాలి పేరు అల్క. ఆమె వయస్సు 29ఏళ్లు. వీరిద్దరికి 10ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

ఈ దంపతులకు సంతానం లేదు. కాగా.. మహిళ తరచూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంది. ఈ విషయంపై ఆమెను నిత్యం తిడుతూనే ఉంటాడు సందీప్​.

Man kills ill wife : కాగా.. గురువారం రాత్రి.. అనారోగ్యం కారణంగా మంచం మీదే మలవిసర్జన చేసింది అల్క. అంతే! కోపంతో ఊగిపోయిన సందీప్​.. ఆమెను చంపేశాడు!

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు అల్క మృతదేహం పక్కనే కూర్చుని ఉన్న సందీప్​ కనిపించాడు. అతడిని వెంటనే అరెస్ట్​ చేసిన పోలీసులు.. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మంచం మీద మలవిసర్జన చేసిందన్న కోపంతోనే భార్యను చంపేసినట్టు.. విచారణలో అంగీకరించాడు నిందితుడు.

అప్పు తీర్చమని అడిగినందుకు..!

Delhi crime news : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ మహిళను, ఓ వ్యక్తి కిరాతకంగా చంపి.. ముఖం మీద యాసిడ్​ పోసిన ఘటన తాజాగా దిల్లీలో వెలుగులోకి వచ్చింది. చేసిన అప్పును తీర్చమని మహిళ అడగడంతో.. కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి, చివరికి.. ఆమెను చంపేశాడు.

నిందితుడు, బాధితురాలు.. దిల్లీ నిజాముద్దిన్​ రైల్వే స్టేషన్​లో పనిచేస్తున్నారు. నిందితుడు మహమ్మద్​ జాకిర్​.. రైల్వే స్టేషన్​లో టెక్నికల్​ సూపర్​వైజర్​. బాధితురాలు ఓ క్లర్క్​. కాగా.. 2018-19 మధ్యలో అతనికి, ఆమె రూ. 11లక్షల వరకు అప్పు ఇచ్చింది. వివిధ మార్గాల్లో లోన్​ తీసుకుని, ఆ డబ్బులను జాకిర్​కు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న జాకిర్​.. ఇప్పటివరకు వాటిని తిరిగివ్వలేదు. మహిళపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో.. అప్పు తిరిగివ్వాలని అతడిని పదేపదే అడిగింది. కానీ అతను డబ్బులు చెల్లించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.