Mumbai rape case : మహారాష్ట్రలో ఓ మహిళపై ఏడాది పాటు అత్యాచారం జరిగింది! పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నిందితుడు ఆమెను లొంగదీసుకున్నాడు. చివరికి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.,ఏడాదిగా.. అత్యాచారం..!ముంబైకి చెందిన ఓ 21ఏళ్ల మహిళకు బ్రిజేష్ పాల్‌తో కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీనిచ్చి.. ఆ మహిళను లొంగదీసుకున్నాడు 22ఏళ్ల నిందితుడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా గొడవ పడే వాడు. చివరికి పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పాడు.,Mumbai crime news : "నన్ను పెళ్లి చేసుకుంటానని హామీనిచ్చాడు. నన్ను లైంగికంగా లొంగదీసుకున్నాడు. చివరికి పెళ్లి చేసుకోనని తేల్చేశాడు. నాపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను," అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.,ఘటనపై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకున్న దిదోసి పోలీస్ స్టేషన్ అధికారులు.. బ్రిజేష్ పాల్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచి.. కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి.. బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు హామీనిచ్చారు.,ఐదేళ్లుగా..Uttar Pradesh crime news : దేశంలో మహిళపై అత్యాచారాలు, నేరాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. పెళ్లి సాకుతో వారిని లొంగదీసుకుని చివరికి వదిలించుకుంటున్నారు కొందరు నిందితులు. తాజాగా.. ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి సాకుతో ఐదేళ్లుగా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు ఓ వ్యక్తి! చివరికి జైలు పాలయ్యాడు.,బాల్లియ ప్రాంతంలో నివాసముండే ఓ 24ఏళ్ల మహిళకు నిందితుడితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్ల క్రితం.. ఆ మహిళను లొంగదీసుకున్నాడు. పెళ్లి మాత్రం చేసుకోలేదు. చివరికి.. పెళ్లి చేసుకోనని తేల్చేశాడు. మహిళని దూషించాడు. చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. తనపై నిందితుడు ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టు వెల్లడించింది.,Uttar Pradesh man rapes woman on pretext of marriage : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని వెంటనే పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టు అందిన తర్వాత.. కేసులో తదుపరి చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.,