మెట్రోలో మహిళల వీడియోలు చిత్రీకరించి రీల్స్ పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్-man arrested for filming women in metro posting reels ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మెట్రోలో మహిళల వీడియోలు చిత్రీకరించి రీల్స్ పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

మెట్రోలో మహిళల వీడియోలు చిత్రీకరించి రీల్స్ పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

బెంగళూరు మెట్రోలో అనుమతి లేకుండా మహిళల వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులు తమ గోప్యత, భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగళూరు మెట్రోలో మహిళల ఫోటోలు, వీడియోల చిత్రీకరణ, నిందితుడి అరెస్టు

బెంగళూరు మెట్రోలో మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్న 27 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హావేరి జిల్లాకు చెందిన దిగంత్‌గా గుర్తించారు. బెంగళూరు పీణ్య ప్రాంతంలో శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు @metro_chicks అనే ఖాతాలో మహిళల ఆక్షేపణీయమైన, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఎఫ్‌ఐఆర్ దాఖలైన రెండు రోజుల తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు.

డిప్యూటీ పోలీస్ కమిషనర్ (దక్షిణ) లోకేష్ బి జగలాసర్ ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటింగ్ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అతను రోజువారీ మెట్రో ప్రయాణ సమయంలో, పనికి వెళ్ళేటప్పుడు మహిళల చిత్రాలు, వీడియోలను చిత్రీకరించి, తరువాత వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడని తెలిపారు.

పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. దిగంత్ ఒంటరిగా ఈ పనికి పాల్పడ్డాడా లేదా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఈ పనులు చేశాడు? వీడియోలను ఇతర చోట్ల పంచుకున్నాడా లేదా డబ్బు సంపాదించే ఉద్దేశంతో చేశాడా అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు.

ఫిర్యాదు దాఖలైన విషయం తెలిసిన వెంటనే వీడియోలు, ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేశాడు. కనీసం 14 వీడియోలను పోస్ట్ చేశాడు. మెట్రో రైళ్లు లేదా స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లలో మహిళల క్లోజ్-అప్ వీడియోలు, ఫోటోలను వారికి తెలియకుండా చిత్రీకరించాడు. 'బెంగళూరు సుందర అమ్మాయిలు' అనే ఎబ్బెట్టు శీర్షికలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలను గమనించిన ప్రజలు మెట్రో, బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.