Raping Dogs In Delhi : దిల్లీలో ఆడ కుక్కలపై వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్ చేసిన పోలీసులు-man accused of raping female dogs arrested in delhi shahdara district know more details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Raping Dogs In Delhi : దిల్లీలో ఆడ కుక్కలపై వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్ చేసిన పోలీసులు

Raping Dogs In Delhi : దిల్లీలో ఆడ కుక్కలపై వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్ చేసిన పోలీసులు

Anand Sai HT Telugu

Delhi News : దేశ రాజధానిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కుక్కలపై అత్యాచారం చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

కొందరు కామంధులు జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఘటన బయటకు వచ్చింది. దిల్లీలో ఓ వ్యక్తి కుక్కలపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

దేశ రాజధాని దిల్లీలోని షాహదారా జిల్లాలోని కైలాష్ నగర్ ప్రాంతంలో కొన్ని కుక్కలపై అత్యాచారం చేసిన వ్యక్తిని దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక జంతు స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేయడంతో నిందితుడు నౌషాద్‌ను అరెస్టు చేశారు. నౌషాద్ ఆ స్వచ్ఛంద సంస్థకు సరఫరాదారుగా పనిచేస్తున్నాడు.

'ఒక వ్యక్తి కుక్కపై లైంగిక దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా కనిపించింది. ఆ వీడియోలో ఆ వ్యక్తిని ప్రజలు కొట్టడం, ఎన్ని కుక్కలపై అత్యాచారం చేశావని అడగడం కూడా చూడవచ్చు.' అని దిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ వీడియోను ఒక జంతు కార్యకర్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వ్యక్తిని పట్టుకుని పలువురు కొడుతున్నట్లుగా ఉంది. ఎన్ని కుక్కలను రేప్ చేశావు అని అక్కడ ఉన్నవారు అడిగారు. అధికారుల ప్రకారం, నిందితుడు కనీసం 12-13 ఆడ కుక్కలపై అత్యాచారం చేశాడని ఎన్జీఓ ఆరోపించింది. అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆ కార్యకర్త దిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి రేఖ గుప్తా , లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం, అనేక ఇతర రాజకీయ నాయకులను కూడా పోస్ట్‌లో ట్యాగ్ చేశాడు.

దిల్లీలో ముగ్గురు బంగ్లాదేశీయులు అరెస్ట్

దిల్లీలో అక్రమంగా నివసిస్తున్న ఒక ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేశారు. ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత బహిష్కరణ కేంద్రానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. రహస్య సమాచారం, నిఘా ఆధారంగా ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. దిల్లీలో చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు లేకుండా నివసిస్తున్న ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించడంలో పోలీసు బృందం విజయం సాధించింది. సంబంధిత పత్రాలన్నింటినీ ధృవీకరించిన తర్వాత వారిని అరెస్టు చేసింది.

అరెస్టయిన ముగ్గురిలో బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ నివాసి మహబూబ్ ఆలం (50) ఉన్నారు. వర్క్ పర్మిట్ కోసం పోర్చుగల్ రాయబార కార్యాలయంలో అపాయింట్‌మెంట్ కోసం అతను ఏప్రిల్ 5, 2025న భారతదేశంలోకి ప్రవేశించాడు. వీసా ఏప్రిల్ 8న గడువు ముగిసినప్పటికీ చట్టవిరుద్ధంగా భారతదేశంలోనే ఉన్నాడు.

Anand Sai

eMail

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.