Rajasthan rape case : 5ఏళ్ల మనవరాలిపై వృద్ధుడి అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు-man 71 gets life term for rape of 5 year old granddaughter in baran ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Rape Case : 5ఏళ్ల మనవరాలిపై వృద్ధుడి అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

Rajasthan rape case : 5ఏళ్ల మనవరాలిపై వృద్ధుడి అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

Sharath Chitturi HT Telugu
Sep 01, 2024 10:39 AM IST

ఐదేళ్ల మనవరాలిపై అత్యాచారనికి పాల్పడిన ఓ వృద్ధుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. మరో ఘటనలో 13ఏళ్ల బాలికపై అత్యాచారం జరగ్గా, ఆమె గర్భం దాల్చింది.

5ఏళ్ల మనవరాలిపై వృద్ధుడి అత్యాచారం
5ఏళ్ల మనవరాలిపై వృద్ధుడి అత్యాచారం

రాజస్థాన్​ బరన్ నగరంలో ఐదేళ్ల మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన 71 ఏళ్ల వ్యక్తికి పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2022 అక్టోబర్​లో తన ఇంట్లో జరిగిన నేరానికి నిందితుడు హీరాలాల్​ని దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి సోనియా బెనివాల్ ఆయనకి రూ .50,000 జరిమానా విధించారు.

మైనర్​పై అఘాయిత్యానికి పాల్పడుతుండగా, ఆమె తల్లి- అత్త హీరాలాల్​ని పట్టుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినారాయణ్ సింగ్ తెలిపారు.

బాధితురాలి తల్లి హర్నవాడ షాజీ పోలీస్ స్టేషన్​లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హీరాలాల్​పై ఐపీసీ సెక్షన్ 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన హీరాలాల్​ను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి ఆయన సహజ మరణం వరకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు.

విచారణ సందర్భంగా 18 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశామని, 24 సాక్ష్యాలను కోర్టుకు సమర్పించామని న్యాయవాది తెలిపారు.

ఇదీ చూడండి:- Crime news: వడాపావ్ కోసం ఆగితే.. రూ. 5 లక్షల విలువైన నగలు పోయాయి.. ముంబై లో వృద్ధ దంపతుల విషాదం

కొత్త పెళ్లైన యువతపై..

ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లైన 20 ఏళ్ల యువతిపై ఆమె ఇంట్లోనే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిందితుడిని రాహుల్ (28)గా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం మహిళ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

డబ్బుల కోసం ప్రలోభాలకు గురిచేసి రాహుల్ మొదట యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, అయితే ఆమె ప్రతిఘటించడంతో బాధితురాలి నోరు మూయించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ ఇన్​చార్జి ఇన్​స్పెక్టర్ సచ్చిదానంద్ పాండే తెలిపారు.

భర్త తిరిగి వచ్చాక అత్యాచార బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిందని, వారు పోలీసులను ఆశ్రయించారని పాండే తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై భారతీయ న్యాయ సంస్థ సెక్షన్ 64[1] (అత్యాచారం), 351[2] (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

అత్యాచారంతో గర్భం దాల్చిన 13ఏళ్ల బాలిక..

యూపీ ఫరూఖాబాద్​లో ప్రభుత్వ పాఠశాల ప్యూన్ చేతిలో అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది.

కొన్ని నెలల క్రితం జరిగిన ఈ సంఘటనలో కౌన్సిల్ స్కూల్ ప్యూన్, అతనికి సహకరించిన అతని అనుచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులపై 13 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. బాలిక రాత్రి మలవిసర్జనకు వెళ్లగా గ్రామానికి చెందిన పంకజ్, అమిత్ ఆమెను పట్టుకున్నారు. ఎవరులేని చోటకు తీసుకెళ్లి అమిత్​ అత్యాచారానికి పాల్పడ్డాడని, పంకజ్ బయట నిలబడి నిఘా పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిందితుడు ఆమె నోట్లో గుడ్డ పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బాలికను బెదిరించారు. అయితే బాలిక ఐదు నెలల గర్భవతి కావడంతో ఆమె తల్లికి విషయం తెలిసింది. దీంతో తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడిపై అత్యాచారం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలికకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కాయంగంజ్ కొత్వాలి ఇన్​చార్జి ఇన్​స్పెక్టర్ రామ్ అవతార్ తెలిపారు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ కేసులో త్వరలోనే అరెస్టులు చేస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత కథనం