Man, 2 wives' agreement: ఇద్దరు భార్యల దగ్గర చెరో 3 రోజులు, ఆదివారం మాత్రం ఫ్రీ
Man, 2 wives' agreement: భారత్ లో ఒక వివాహం చెల్లుబాటులో ఉండగా మరో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. అయినా, ఇద్దరు భార్యలతో సామరస్యపూర్వక ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరు భార్యల ముద్దుల సాఫ్ట్వేర్ ఇంజినీర్’ కథ ఇది..
Man, 2 wives' agreement: ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య కోర్టులో కేసు వేసింది. ఫ్యామిలీ కోర్టు ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం ప్రకారం అతడు మొదటి భార్య వద్ద మూడు రోజులు, రెండో భార్య వద్ద మూడు రోజులు ఉండాలి. సండే మాత్రం తన ఇష్టం.
Man, 2 wives' agreement: కోవిడ్ లాక్ డౌన్ సమయంలో..
28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ ఇది. గురుగ్రామ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఈ వ్యక్తికి పెళ్లైంది. ఒక బాబు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఆమెను గ్వాలియర్ లోని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి వచ్చాడు. ఆ తరువాత మళ్లీ ఆమె వద్దకు వెళ్లలేదు. మొదటి పెళ్లి విషయం చెప్పకుండానే, ఇక్కడ తన ఆఫీస్ లో పని చేసే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప జన్మించింది.
Man, 2 wives' agreement: కోర్టు కేసు..
విషయం తెలుసుకున్న మొదటి భార్య గ్వాలియర్ లోని ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. కోర్టు ఈ కేసును సామరస్యపూర్వకంగా ముగించేందుకు వీలుగా హరీశ్ దివాన్ అనే లాయర్ ను కౌన్సెలర్ గా నియమించింది. ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్, ఆయన ఇద్దరు భార్యలతో కౌన్సెలర్ లాయర్ హరీశ్ చర్చించాడు. భర్తను జైలుకు పంపించాలని తనకు లేదని మొదటి భార్య చెప్పింది. మొదటి భార్యను తీసుకువెళ్లడానికి ఆసక్తి చూపని ఆ ఇంజినీర్ కు.. మొదటి వివాహం చెలామణిలో ఉండగానే, రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని, ఆమె కేసు వేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వివరించాడు. మొదటి భార్యతో కలిసి ఉండడానికి తనకు అభ్యంతరం లేదని రెండో భార్య స్పష్టం చేసింది.
Man, 2 wives' agreement: చెరో మూడు రోజుల ఒప్పందం..
దాంతో, అడ్వొకేట్ హరీశ్ ఒక ఒప్పందాన్ని రూపొందించాడు. ఆ ఇంజినీర్ ఆస్తిని, సమయాన్ని ఇద్దరు భార్యలకు సమంగా పంచాలని నిర్ణయించాడు. వారంలో తొలి మూడు రోజులైన సోమవారం, మంగళవారం, బుధవారం మొదటి భార్య వద్ద.. చివరి మూడు రోజులైన గురువారం, శుక్రవారం, శనివారం రెండో భార్య వద్ద ఉండేలా, ఆదివారం మాత్రం తనకు ఇష్టమైన వారి వద్ద ఉండేలా ఒప్పందాన్ని సిద్ధం చేశాడు. అలాగే, ఆ వ్యక్తికి వచ్చే నెలవారీ వేతనం రూ. 1.5 లక్షలను ఇద్దరు భార్యలకు సమంగా పంచేలా, అతడికి ఉన్న రెండు ఫ్లాట్లను ఇద్దరు భార్యలకు చెరొకటి రిజిస్టర్ చేసేలా ఒప్పందంలో పొందుపర్చాడు. ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నట్లు ఆ ఇంజినీర్, ఆయన ఇద్దరు భార్యలు గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టుకు తెలిపారు. ఆ వ్యక్తి ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తే, కోర్టుకు ఫిర్యాదు చేసే హక్కు మొదటి భార్యకు మాత్రమే ఉంటుంది.
Man, 2 wives' agreement: చట్టం ఒప్పుకోదు కానీ..
కోర్టు ద్వారా కుదిరిన ఈ ఒప్పందం న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. చట్టబద్ధంగా నేరమైన ఒక చర్యను ఇలా ఒప్పందం ద్వారా సమర్ధించడం సరికాదని ఒక వర్గం వాదిస్తుండగా, ఆ విషయంలో వారిలో ఎవరైనా ఫిర్యాదు చేయకుండా, ఏమీ చేయలేమని, అందువల్ల ఒప్పందం సరైన చర్యేనని మరో వర్గం వాదించింది. కోర్టు వరకు వెళ్లకుండా, ఇలా పరస్పర అంగీకారంతో కలిసి ఉంటున్న ఘటనలు సాధారణమేనని పేర్కొంది. చట్టబద్ధంగా నేరమైన ద్వితీయ వివాహమనే చర్యకు పాల్పడినందుకు ఆ వ్యక్తికి శిక్ష పడకుండా ఇలా ఒప్పందం ద్వారా అడ్డుకోవడంపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది.