Mamata skips home ministers' meeting: అమిత్ షా మీటింగ్ ను లైట్ తీసుకున్న మమత-mamata not to attend state home ministers meeting convened by centre ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mamata Not To Attend State Home Ministers' Meeting Convened By Centre

Mamata skips home ministers' meeting: అమిత్ షా మీటింగ్ ను లైట్ తీసుకున్న మమత

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 02:24 PM IST

Mamata skips home ministers' meeting: హరియాణాలోని సూరజ్ కుండ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్రాల హోం మంత్రుల సమావేశానికి హాజరు కాకూడదని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్ణయించుకున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ

Mamata skips home ministers' meeting: హరియాణాలోని సూరజ్ కుండ్ లో రాష్ట్రాల హోం మంత్రుల సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ చింతన్ శిబిర్’కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Mamata skips home ministers' meeting: వెస్ట్ బెంగాల్ సీఎం గైర్హాజరు

ఈ చింతన్ శిబిర్ వివరాలను దాదాపు నెల క్రితమే కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. ఈ సమావేశాలకు హాజరు కావాలని అన్ని రాష్ట్రాలను కోరింది. అయితే, ఈ సమావేశాలకు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ హాజరు కావడం లేదు. పశ్చిమ బెంగాల్ లో హోం శాఖ ను కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి మమత నే చూస్తున్నారు.

Mamata skips home ministers' meeting: హోం సెక్రటరీ, డీజీపీ కూడా..

రాష్ట్రాల హోం మంత్రుల సదస్సుకు పశ్చిమబెంగాల్ తరఫున హోం మంత్రిత్వ బాధ్యతలు చూస్తున్న సీఎ మమత బెనర్జీ కానీ, హోం శాఖ కార్యదర్శి బీపీ గోపాలిక కానీ, డీజీపీ మనోజ్ మాలవీయ కానీ హాజరు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం తరఫున ఏడీజీ(హోం గార్డ్) నీరజ్ కుమార్ సింగ్, ఢిల్లీలో పశ్చిమబెంగాల్ రెసిడెంట్ కమిషనర్ రామ్ దాస్ మీనా హరియాణాలో జరిగే ఈ చింతన్ శిబిర్ కు హాజరవుతారని తెలిపింది.

Mamata skips home ministers' meeting: పండుగ సీజన్ కదా..

పశ్చిమబెంగాల్ లో ఇది పండుగ సీజన్ కావడంతో ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందువల్ల ఆమె హోం మంత్రుల సదస్సుకు హాజరు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘గురువారం భాయి దూజ్ పండుగ ఉంది. ఛాట్ పూజ కూడా తొందరలోనే ఉంది. ఈ సమయంలో సీఎం రాష్ట్రాన్ని వదిలి వెళ్లడం సాధ్యం కాదు. అవే కారణాలతో రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీ కూడా చింతన్ శిబిర్ కు హాజరు కావడం లేదు’ అని ఆ ప్రకటన వివరించింది.

IPL_Entry_Point