Pune-Bengaluru highway accident: హైవేపై భారీ రోడ్డు ప్రమాదం.. 40కుపైగా వాహనాలు ధ్వంసం!-major accident occurred at navale bridge on pune bangaluru highway ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Major Accident Occurred At Navale Bridge On Pune Bangaluru Highway

Pune-Bengaluru highway accident: హైవేపై భారీ రోడ్డు ప్రమాదం.. 40కుపైగా వాహనాలు ధ్వంసం!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 20, 2022 11:34 PM IST

Pune-Bengaluru highway accident: పూణెలోని ఓ బ్రిడ్జి వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 48 వరకు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

Pune-Bengaluru highway accident: బ్రిడ్జిపై భారీ రోడ్డు ప్రమాదం
Pune-Bengaluru highway accident: బ్రిడ్జిపై భారీ రోడ్డు ప్రమాదం (PTI)

Pune-Bengaluru highway accident: బెంగళూరు-పూణె హైవేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని నవాలే వంతెన వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‍లో ఏకంగా 48 వాహనాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. పూణె అగ్నిమాపక దళం ఈ విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలైనట్టు సమాచారం. సహాయక చర్యలు సాగుతుండగా.. మరింత అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

పూణె అగ్నిమాపక దళం, పూణె మెట్రోపాలిటన్ రిజనల్ డెవలప్‍మెంట్ అథారిటీ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నాయి. ఓ ట్రక్ కంటైనర్ బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం మొదలైందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ట్రక్ మరిన్ని వాహనాలను ఢీకొందని తెలుస్తోంది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో మరిన్ని వాహనాలు జారి అదుపు తప్పి ఒకదానికి ఒకటి ఢీకొన్నాయని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలోనూ కొందరు పోస్ట్ చేశారు.

ఈ భారీ రోడ్డు ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. సహాయక చర్యల తర్వాత అధికారులు ఈ విషయంపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

IPL_Entry_Point