Maharashtra road accident : రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మరణం.. షిరిడీకి వెళుతూ!
Maharashtra road accident : షిరిడీ సాయి బాబా దర్శనానికి బయలుదేరిన ఓ బస్సు.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Maharashtra road accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిరిడీ సాయి బాబా దర్శనం కోసం వెళుతున్న ఓ బస్సు.. ఓ లారీని ఢీకొట్టింది. నాసిక్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 10మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఠాణే జిల్లా అంబేర్నాథ్ ప్రాంతం నుంచి ఓ లగ్జరీ బస్సు.. సాయి బాబా భక్తులతో బయలు దేరింది. ఈ బస్సు షిరిడీ వెళ్లాల్సి ఉంది. కాగా.. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో.. ముంబైకు 180 కి.మీల దూరం, నాసిక్ శిన్నార్ తాలూకా పథారే షివర్ ప్రాంతంలో ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రాంతం.. షిరిడీ నుంచి 20 కి.మీల దూరంల ఉంది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Nashik Shirdi highway Road accident today : ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను శిన్నార్ రూరల్ హాస్పిటల్కు, యశ్వంత్ హాస్పిటల్కు తరలించారు.
రోడ్డు ప్రమాదంపై.. సీఎం దిగ్భ్రాంతి
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు ఏక్నాథ్ శిండే.
ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
సంబంధిత కథనం
China road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం
January 08 2023
Road accidents: రోడ్లు మింగేసిన ప్రాణాలు 1.5 లక్షలు..
January 06 2023