Maharashtra rape case : ఐదేళ్ల చిన్నారిపై మెకానిక్​ అత్యాచారం.. లిఫ్ట్​లో!-maharashtra rape case ac mechanic rapes five year old girl in building lift arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Rape Case, Ac Mechanic Rapes Five-year-old Girl In Building Lift; Arrested

Maharashtra rape case : ఐదేళ్ల చిన్నారిపై మెకానిక్​ అత్యాచారం.. లిఫ్ట్​లో!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 10, 2022 04:25 PM IST

Maharashtra rape case : ఓ భవనంలో ఏసీని రిపేర్​ చేయడానికి వెళ్లిన మెకానిక్​.. అక్కడే ఉన్న 5ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఐదేళ్ల చిన్నారిపై మెకానిక్​ అత్యాచారం.. లిఫ్ట్​లో!
ఐదేళ్ల చిన్నారిపై మెకానిక్​ అత్యాచారం.. లిఫ్ట్​లో!

Maharashtra rape case : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 5ఏళ్ల చిన్నారిపై ఓ ఏసీ మెకానిక్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

లిఫ్ట్​లో దారుణం…!

నవీ ముంబైలోని భవనంలో మంగళవారం జరిగింది ఈ ఘటన. 19ఏళ్ల నిందితుడు ఓ ఏసీ మెకానిక్​. భవనంలోని ఓ ఇంట్లో ఏసీని రిపేర్​ చేసి.. మెట్ల మార్గంలో కిందికి దిగాడు. అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని చూశాడు. ఆమెను బలవంతంగా లిఫ్ట్​లోకి తీసుకెళ్లి లైంగికంగా దాడి చేసి, రేప్​ చేశాడు.

Maharashtra crime news : ఈ ఘటన జరిగిన వెంటనే ధితురాలు ఇంటికి పరిగెత్తి వాంతులు చేసుకుంది. అది ఆమె తల్లి గమనించింది. ఏం జరిగిందని ప్రశ్నిచగా.. బాలిక మొత్తం చెప్పింది. కిందికి పరుగులు తీసిన తల్లికి నిందితుడు కనిపించాడు. ఆమె అరుపులతో.. చుట్టుపక్కన వారంతా అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిపై సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

బాలుడిపై అత్యాచారం..!

ఓ బాలుడిపై ఓ 34ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నం చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్​లో చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.

Uttar Pradesh rape case : 9ఏళ్ల బాలుడు ఆస్ట్రేలియాలో నివాసముంటున్నాడు. ఇటీవలే వారి కుటుంబం ఉత్తర్​ప్రదేశ్​కు వచ్చింది. గురువారం ఓ వివాహ వేడుకకు హాజరైంది. అక్కడ ఓ వ్యక్తి.. బాలుడిని బలవంతంగా బాత్​రూమ్​లోకి తీసుకెళ్లాడు. అతడిని రేప్​ చేసేందుకు యత్నించాడు. బాలుడు గట్టిగా అరిచాడు. బాత్​రూమ్​ నుంచి శబ్దాలు రావడంతో అందరు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే బాలుడి తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Man rapes boy : నిందితుడు.. మీరట్​ గంగా నగర్​ కాలనీకి చెందిన నిశాంత్​ శర్మగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని జైలుకు తరలించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం