Maharashtra politics : రెబల్స్​పై ఉద్ధవ్​ 'రష్మి' అస్త్రం.. వ్యూహం ఫలించేనా?-maharashtra politics centre provides y crpf security cover to 15 rebel shiv sena mlas ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Politics : Centre Provides 'Y ' Crpf Security Cover To 15 Rebel Shiv Sena Mlas

Maharashtra politics : రెబల్స్​పై ఉద్ధవ్​ 'రష్మి' అస్త్రం.. వ్యూహం ఫలించేనా?

Sharath Chitturi HT Telugu
Jun 26, 2022 02:48 PM IST

Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాల పరిస్థితులను తనవైపు తిప్పుకునేందుకు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే ‘రష్మి’ అస్త్రాన్ని ప్రయోగించినట్టు కనిపిస్తోంది. ఉద్ధవ్​ సతీమణి రష్మి.. రెబల్​ ఎమ్మెల్యేల భార్యలతో రహస్యంగా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇవి ఫలించేనా?

ఉద్ధవ్​ ఠాక్రే
ఉద్ధవ్​ ఠాక్రే (HT_PRINT)

Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. తాజాగా.. 15మంది శివసేన రెబల్​ ఎమ్మెల్యేలకు కేంద్రం వై కేటగిరీ భద్రతను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం గౌహతీలో ఉన్న వారికి.. సీఆర్​పీఎఫ్​తో కూడిన భద్రత దక్కనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఎమ్మెల్యేలు రమేష్​ బోర్నరే, మంగేష్​ కుదాల్కర్​, సంజయ్​ శిర్సట్​, లతాబాయ్​ సోనావానే, ప్రకాశ్​ సుర్వె, సదానంద్​ సరనవంకర్​, యోగేష్​ దాడా కదం, ప్రతాప్​ సర్నైక్​, యామిని జాదవ్​, ప్రదీప్​ జైశ్వాల్​, సంజయ్​ రాథోడ్​, దాదాజి భూషే, దిలీప్​ లండే, బాలాజీ కల్యానర్​, సందీపన్​ భూమేర్​ల భద్రతను సీఆర్​పీఎఫ్​ దళాలు.. చూసుకోనున్నాయి. శివసేన కీలక నేత, తిరుగుబాటు వ్యూహాన్ని రచించిన ఏక్​నాథ్​ షిండే పేరు ఈ జాబితాలో లేదు!

ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు మొదలయ్యాయి. సీఆర్​పీఎఫ్​కు ఆదివారమే కేంద్ర హోంశాఖ నుంచి సంబంధిత లేక అందింది.

ఎమ్మెల్యేలకు ఉండాల్సిన భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని ఏక్​నాథ్​ షిండే ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం వై కేటగిరీని ఏర్పాటు చేసింది. కాగా.. తాము ఎలాంటి భద్రతను తొలగించలేదని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్​ వాల్సే పాటిల్​ స్పష్టం చేశారు.

రంగంలోకి ఉద్ధవ్​ సతీమణి..

తిరుగుబాటు నేతల వర్గం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఏక్​నాథ్​ వద్ద 40కిపైగా మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు! ఏక్​నాథ్​ తలచుకుంటే.. పార్టీని చీల్చేయవచ్చు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాలు కూడా ఏం చేయలేవు. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను మరింత వేధించే విషయం. శివసేన- రెబల్స్​ ప్రతిష్ఠంభన మధ్య.. ఉద్ధవ్​ ఠాక్రే సతీమణి రష్మి వార్తల్లో నిలిచారు.

Uddhav Thackery : రష్మి.. తెరవెనుక రాజకీయాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెబల్​ ఎమ్మెల్యేల భార్యలతో ఉద్ధవ్​ సతీమణి రహస్య చర్చలు జరుపుతున్నట్టు.. భర్తలను వెనక్కి తిరిగివచ్చే విధంగా మాట్లాడాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది స్పష్టత లేదు.

రెబల్స్​ శాంతించారా?

గౌహతీలో ఉంటున్న శివసేన రెబల్స్​లోని 20మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్​ ఠాక్రేతో 'టచ్​'లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరిని తనవైపు తిప్పుకుంటే శివసేన.. పరిస్థితులను చక్కదిద్దిన్నట్టే!

కాగా.. రెబల్స్​ బృందంలో మనస్పర్థలు పెరుగుతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరాలని కొందరు భావిస్తుంటే.. ఆ ఆలోచనను మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

'రాజీనామా చేయండి..'

ఈ క్రమంలో.. మహారాష్ట్ర మంత్రి, ఉద్ధవ్​ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే.. రెబల్స్​కు సవాలు విసిరారు. తన తండ్రి చేసింది తప్పు అని అనిపిస్తే.. వెంటనే రాజీనామా చేయాలని తేల్చిచెప్పారు. తాము ఎన్నికలకు సిద్ధమని స్పష్టం చేశారు.

"మీకు ధైర్యం ఉంటే శివసేనను విడిచిపెట్టి వెళ్లిపోండి. ఒంటరిగా పోరాడండి. మేము చేసింది, ఉద్ధవ్​ ఠాక్రే చేసింది తప్పు అని మీకు అనిపిస్తే.. రాజీనామా చేయండి. ఎలక్షన్​ను ఎదుర్కోండి. ఎన్నికలకు మేము సిద్ధమే," అని ఆదిత్య ఠాక్రే అన్నారు.

ఇదీ జరిగింది..

Eknath Shinde latest news : మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వంలో.. శివసేనది కీలక పాత్ర. కాగా.. ఎన్​సీపీ-కాంగ్రెస్​తో శివసేన చేతులు కలపడం.. ఆ పార్టీలో కొందరికి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే శివసేనపై ఆ పార్టీ కీలక నేత ఏక్​నాథ్​ షిండేకు అసంతృప్తి పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆయన అనూహ్యంగా మాయమైపోయారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు గుజరాత్​ సూరత్​లో దర్శనమిచ్చారు. అక్కడి నుంచి అందరు కలిసి గౌహతీకి వెళ్లారు.

రెబల్స్​ బృందానికి 'శివసేన బాలాసాహెబ్​' అన్న పేరు పెట్టారు ఏక్​నాథ్​ షిండే. ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు? శివసేన పరిస్థితేంటి? మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు.. సామాన్యుల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్