Crime: వాట్సాప్ వీడియో కాల్ చేసి రూ.6.5లక్షలు కొల్లగొట్టారు!-maharashtra man falls prey to sextortion loses 6 5 lakh rupees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Man Falls Prey To Sextortion Loses 6 5 Lakh Rupees

Crime: వాట్సాప్ వీడియో కాల్ చేసి రూ.6.5లక్షలు కొల్లగొట్టారు!

Chatakonda Krishna Prakash HT Telugu
May 31, 2023 10:51 AM IST

Crime: వాట్సాప్ వీడియో కాల్‍తో ఓ వ్యక్తిని ఓ మహిళ మోసం చేసింది. ఆ తర్వాత అతడి నుంచి రూ.6.5లక్షలను కొల్లగొట్టారు. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Crime: ఓ మహిళ చేసిన వాట్సాప్ వీడియో కాల్ వల్ల ఓ వ్యక్తి ఏకంగా రూ.6.50లక్షలను కోల్పోయాడు. దశల వారీగా డబ్బు చెల్లిస్తూ మోసపోయాడు. అనంతరం ఈ విషయంపై తాజాగా పోలీసులు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ కార్పొరేట్ కన్సల్టెంట్ ఈ మోసానికి నష్టపోయాడు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

ఫిర్యాదు ప్రకారం, ఈ ఏడాది మార్చి 17వ తేదీన థానేకు చెందిన ఆ వ్యక్తికి వాట్సాప్ ద్వారా ఓ అన్‍నౌన్ నంబర్ నుంచి వీడియో వచ్చింది. ఆ కాల్‍లో ఓ మహిళ అతడితో మాట్లాడింది. ముచ్చట్లు చాలా సేపు సాగాయి. అయితే ఓ దశలో ఆ మహిళ వీడియో కాల్‍లో ఉండగానే.. దుస్తులు మొత్తం విప్పేసింది. దీంతో ఖంగుతిన్న అతడు కొన్ని క్షణాల తర్వాత వీడియో కాల్ డిస్‍కనెక్ట్ చేశాడు. ఈ వివరాలను కాసర్వాదవలి పోలీస్ స్టేషన్ అధికారులు ఒకరు వెల్లడించారు.

ఆ వీడియో కాల్ డిస్‍కనెక్ట్ చేసిన కాసేపటి తర్వాత ఆ వ్యక్తికి వాట్సాప్‍లో ఓ వీడియో, స్క్రీన్ షాట్లు వచ్చాయి. దుస్తులు లేకుండా ఉన్న ఆ మహిళతో వీడియో కాల్‍లో మాట్లాడుతున్నట్టు అందులో ఉన్నాయి. దీంతో భయపడిన అతడు వాటిని డిలీట్ చేశాడు.

ఆ తర్వాతి రోజు ఆ వ్యక్తికి ఓ అన్‍నౌన్ నంబర్‌ నుంచి కాల్ వచ్చింది. తాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ అంటూ ఆ కాలర్ చెప్పుకున్నాడు. ఆ మహిళ సెక్స్ రాకెట్ నడుపుతోందని, ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‍లోడ్ చేస్తుండగా అడ్డుకున్నామని ఆ వ్యక్తికి కాలర్ చెప్పాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో అప్‍లోడ్ చేయకుండా ఉండాలంటే మరో వ్యక్తిని సంప్రదించాలని చెప్పాడు. ఇక అతడు.. మరో వ్యక్తికి కాల్ చేయగా.. రూ.50,000 డిమాండ్ చేశాడు. ఇక గత్యంతరం లేక పేమెంట్ చేశాడు.

మార్చి 18వ తేదీ నుంచి 25వ తేదీన మధ్య ఆ వీడియో, స్క్రీన్ షాట్ల గురించి అతడికి చాలా మంది కాల్స్ చేశారు. ఇలా మొత్తంగా రూ.6.50లక్షలు లాగేసుకున్నారు. ఇప్పటికీ కాల్స్ కొనసాగుతుండటంతో ఒత్తిడికి గురైన అతడు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాలను పోలీసు అధికారులు వెల్లడించారు.

థానేకు చెందిన ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‍ఐఆర్ నమోదు చేశారు. మొత్తంగా 15 మందిపై కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్లు 420, 406, 34, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

IPL_Entry_Point