Mahakumbh 2025: ఘనంగా కొనసాగుతున్న మహా కుంభమేళా సందర్భంగా నెలకొన్న డిమాండ్ కు అనుగుణంగా నాలుగు నగరాల నుంచి ప్రత్యేక విమానాలను ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు నడపాలని విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ నిర్ణయించింది. పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నుంచి ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక డైరెక్ట్, కనెక్టింగ్ విమానాలను ఆకాశ ఎయిర్ జనవరి 25న ప్రకటించింది. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు పెరిగిన డిమాండ్ ను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
ఆకాశ ఎయిర్ ప్రత్యేక విమానాలు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల నుంచి ప్రయాగ్ రాజ్ కు జనవరి 28 నుండి ఫిబ్రవరి 26 వరకు నడుస్తాయి. ఆకాశ ఎయిర్ టైంటేబుల్ ప్రకారం, నాలుగు నగరాల నుండి రోజువారీ విమానాలు ఢిల్లీలో స్టాప్ఓవర్ ను కలిగి ఉంటాయి. అహ్మదాబాద్, బెంగళూరు (bengaluru news) నుండి మాత్రమే డైరెక్ట్ విమానాలు నడుస్తాయి. అవి ఎంపిక చేసిన రోజుల్లో అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక విమానాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆకాశ ఎయిర్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
మహాకుంభ (maha kumbhamela 2025) అనేది భారతదేశపు అతిపెద్ద పండుగ. ఇది జనవరి 13 న ప్రారంభమై ఫిబ్రవరి 26 న మహా శివరాత్రి రోజున ముగుస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది.
జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ
జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి షాహి స్నాన్)
జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ షాహి స్నానం)
ఫిబ్రవరి 3, 2025: వసంత పంచమి (మూడవ షాహీ స్నానం)
ఫిబ్రవరి 4, 2025: అచ్లా సప్తమి
ఫిబ్రవరి 12, 2025: మాఘీ పూర్ణిమ
ఫిబ్రవరి 26, 2025: మహా శివరాత్రి (చివరి స్నానం)
టాపిక్