Mahakumbh 2025: మహా కుంభమేళాకు తరలివస్తున్న భక్త జనం; ఇప్పటివరకు 10 కోట్ల మంది పుణ్య స్నానాలు
Mahakumbh 2025: 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభ మేళా 2025 లో పాల్గొనడానికి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు దేశ, విదేశాల నుంచి భక్త జనం తరలి వస్తున్నారు. మహాకుంభమేళాలో కేవలం 11 రోజుల్లోనే 9.73 కోట్ల మంది భక్తులు, కల్పవాసీలు, పీఠాధిపతులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Mahakumbh 2025: మహాకుంభమేళాలో కేవలం 11 రోజుల్లోనే 9.73 కోట్ల మంది భక్తులు, కల్పవాసీలు, పీఠాధిపతులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అపూర్వమైన భక్తుల తాకిడితో 11వ రోజైన నేటితో మొత్తం భక్తుల సంఖ్య 10 కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గురువారం 16.98 లక్షల మందికి పైగా ప్రజలు గంగా, యమునా, సరస్వతి పవిత్ర సంగమంలో స్నానమాచరించారు. దీంతో పాటు ఈ నెల 29న జరగనున్న మౌని అమావాస్యకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

కనీసం 40 కోట్ల మంది
ఈసారి మహా కుంభమేళా (maha kumbha mela 2025) కు 45 కోట్లకు పైగా ప్రజలు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. సందర్శకుల్లో వివిధ 'బాబాలు' ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వారు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటారు. యువతను మేల్కొలిపే లక్ష్యంతో 'పహిల్వాన్ బాబా'గా పిలువబడే రాజ్పాల్ సింగ్ అలాంటి వారిలో ఒకరు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆధ్యాత్మికతను మిళితం చేస్తూ ఆయన ఈ కుంభమేళాలో ప్రముఖంగా పాల్గొంటున్నారు.
భక్తితో పాటు సందేశం
యువతను జాగృతం చేయడం, మాదకద్రవ్యాలను నిర్మూలించడం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం, భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చడమే లక్ష్యమని పహిల్వాన్ బాబా చెప్పారు. ‘‘నా వయస్సు 50 సంవత్సరాలు. నేను ఒక చేత్తో 10,000 పుష్ అప్ లు చేయగలను. ఈ వయసులో నేను అంత కష్టపడగలిగితే, యువత నాలుగు రెట్లు ఎక్కువ చేయగలదు' అని రాజ్పాల్ సింగ్ అన్నారు.
యోగి ఆదిత్య నాథ్
ప్రయాగ్ రాజ్ లో బుధవారం జరిగిన మహా కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ (uttar pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఇతర కేబినెట్ మంత్రులు సీఎం వెంట ఉన్నారు. ప్రయాగ్రాజ్ వారణాసి, ఆగ్రాలకు మున్సిపల్ కార్పొరేషన్ బాండ్లను జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం యోగి ప్రకటించారు.