Telugu News  /  National International  /  Maha: Woman Mauled To Death By Tiger In Chandrapur
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Woman mauled to death by tiger: మహిళను చంపేసిన పులి

27 September 2022, 22:06 ISTHT Telugu Desk
27 September 2022, 22:06 IST

Woman mauled to death by tiger: 55 ఏళ్ల మహిళను పులి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Woman mauled to death by tiger పొదల్లో మాటేసి..

Woman mauled to death by tiger: మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రాపుర్ జిల్లాలో, జిల్లా కేంద్రానికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవల్గావ్ గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. ఆ గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళ ద్రుపద మొహుర్లె ను పులి చంపేసింది. పొదల్లో మాటేసి ఉన్న పులి.. మంగళవారం మధ్యాహ్నం పొలం పనికి వెళ్తున్న ద్రుపదపై ఒక్కసారిగా దూకి, ప్రాణం తీసేసింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు చేపట్టారు. చివరకు, ఆమె మృతదేహాన్ని అటవీప్రాంతంలోని కంపార్ట్మెంట్ 1138లో గుర్తించారు. పులి సంచారం గురించి సమీప గ్రామాల వారికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేశామని బ్రహ్మపురి ఫారెస్ట్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్ డీ షిండె తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు