Sadhus thrashed in Maharashtra: మహారాష్ట్రలో సాధువులపై దాడి
Sadhus thrashed in Maharashtra: మహారాష్ట్రలో నలుగురు సాధువులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. చిన్న పిల్లలను ఎత్తుకు వెళ్లే వారిగా భావించి వారిపై స్థానికులు దాడి చేశారు.
Sadhus thrashed in Maharashtra: మహారాష్ట్రలోని సాంగ్లిలో నలుగురు సాధువులపై స్థానికులు దాడి చేశారు. వారిని దారుణంగా కొట్టడంతో సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sadhus thrashed in Maharashtra: దొంగలుగా భావించి..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన నలుగురు సాధువులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న పండర్ పూర్ కు ఒక వాహనంలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో, వారు మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఉన్న జాఠ్ తెహసిల్ లోని లవంగ గ్రామంలోకి వచ్చారు. వారిని చూసిన స్థానిక బాలుడు భయపడి `దొంగ.. దొంగ` అని అరవడంతో అప్రమత్తమైన అక్కడి స్థానికులు ఆ సాధువులను పిల్లలను ఎత్తుకువెళ్లే దొంగలుగా భావించి, వారిని అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి, స్థానికులను అడ్డుకుని, సాధువుల గురించి ఆరా తీశారు. వారు యూపీకి చెందిన అఖాడా సాధువులని నిర్ధారించుకున్నారు.
Sadhus thrashed in Maharashtra: కేసు నమోదు..
అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆ సాధువులు నిరాకరించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు . దాంతో, పోలీసులే సు మోటో గా కేసు నమోదు చేశారు. 18 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఆ సాధువులను కర్రలతో తీవ్రంగా కొడుతున్న వీడియో వైరల్ అయింది.