Maha Kumbh Mela : మహా కుంభమేళాకు వెళ్లే వారికి గుడ్​ న్యూస్​! విమాన ధరలు 50శాతం కట్​..-maha kumbh mela 2025 minister says airlines to cut fares by percent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maha Kumbh Mela : మహా కుంభమేళాకు వెళ్లే వారికి గుడ్​ న్యూస్​! విమాన ధరలు 50శాతం కట్​..

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు వెళ్లే వారికి గుడ్​ న్యూస్​! విమాన ధరలు 50శాతం కట్​..

Sharath Chitturi HT Telugu
Feb 01, 2025 06:03 AM IST

Maha Kumbh Mela flight rates : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్​ న్యూస్​! విమాన టికెట్​ ధరలను 50శాతం కట్​ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్​ మోహన్​ నాయుడు ప్రకటించారు. పూర్తి వివరాలు..

మహా కుంభమేళాలో భక్తుల స్నానాలు..
మహా కుంభమేళాలో భక్తుల స్నానాలు.. (PTI)

మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్​రాజ్​కు వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యే విమానాల టికెట్​ ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. అనేక విమానయాన సంస్థలు దేశంలోని అనేక చోట్లు సాధారణ టికెట్​ రేట్ల కన్నా 5,6 రెట్లు అధికంగా వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. భక్తుల సెంటిమెంట్​పై వ్యాపారం చేస్తున్నాయని ప్రజలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళాకు వెళుతున్న భక్తులకు ఊరటనిచ్చే విధంగా, విమాన టికెట్​ ధరలను 50శాతం కట్​ చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి కే. రామ్​ మోహన్​ నాయుడు ప్రకటించారు.

yearly horoscope entry point

మహా కుంభమేళాకు వెళ్లే విమానాల టికెట్​ ధరలు తగ్గింపు..

మహా కుంభమేళా నేపథ్యంలో నానాటికి పెరిగిపోతున్న విమాన టికెట్​ ధరలను కేంద్రం కట్టడి చేసింది. 50శాతం వరకు టికెట్​ రేట్లు తగ్గించాలని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా సంస్థలతో మూడుసార్లు సమావేశమైనట్టు రామ్​ మోహన్​ నాయుడు వెల్లడించారు.

మహా కుంభమేళా వంటి అత్యంత పవిత్ర కార్యక్రమాలు 140 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని, వాటి విశిష్టతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని విమానయాన సంస్థలకు కేంద్రం గుర్తుచేసింది.

వాస్తవానికి జనవరి 23నే ఈ విషయంపై డీజీసీఏ విమానయాన సంస్థలతో చర్చలు జరిపింది. డిమాండ్​కు తగ్గట్టు విమాన సేవలను పెంచాలని, టికెట్​ రేట్లు హేతుబద్ధీకరించాలని స్పష్టం చేసింది. కానీ విమాన టికెట్​ రేట్ల విషయంలో పెద్దగా మార్పులు కనిపించలేదు. జనవరి 31వరకు హైదరాబాద్​ నుంచి ప్రయాగ్​రాజ్​ వరకు విమాన టికెట్​ ధర రూ. 53వేల వరకు వెళ్లింది. ముంబై, బెంగళూరు సహా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు రూ. 5వేల నుంచి రూ. 6వేలు మాత్రమే అవుతుంది!

జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. ఇప్పటికే 199.4 మిలియన్​ మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఫలితంగా విమాన సేవలకు డిమాండ్​ విపరీతంగా పెరిగిపోయింది. సేవలను పెంచాలన్న విజ్ఞప్తితో స్పైస్​జెట్​ సహా అనేక సంస్థలు నిత్యం 130కిపైగా విమానాలను ప్రయాగ్​రాజ్​కు నడుపుతున్నాయి. ఇప్పుడు టికెట్​ రేట్లు కూడా దిగిరావడంతో ప్రజలకు ఊరట లభించినట్టు అయ్యింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.