Maha Kumbh 2025: మానవ చరిత్రలోనే అద్భుత ఘట్టం; మహా కుంభమేళాలో 50 కోట్ల మంది పుణ్య స్నానాలు-maha kumbh 2025 achieves historic milestone as 50 crore take holy dip till february 14th ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maha Kumbh 2025: మానవ చరిత్రలోనే అద్భుత ఘట్టం; మహా కుంభమేళాలో 50 కోట్ల మంది పుణ్య స్నానాలు

Maha Kumbh 2025: మానవ చరిత్రలోనే అద్భుత ఘట్టం; మహా కుంభమేళాలో 50 కోట్ల మంది పుణ్య స్నానాలు

Sudarshan V HT Telugu
Published Feb 14, 2025 10:05 PM IST

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. మానవ చరిత్రలో ఏ మత, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదు.

మహా కుంభమేళా
మహా కుంభమేళా (PTI)

Maha Kumbh 2025 record: మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణి సంగమంలో ఇప్పటివరకు పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లు దాటింది. ఈ సంఖ్య దాదాపు చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువ. యూపీ ప్రభుత్వం ఈ వివరాలను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే 1 కోటి మందికి పైగా పవిత్ర స్నానాలను ఆచరించారని తెలిపింది. మొత్తంగా, శుక్రవారం, ఫిబ్రవరి 14 సాయంత్రం వరకు మహా కుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఏ మత, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదు.

అంచనాలు మించి..

మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ప్రస్తుత సంఖ్య అన్ని అంచనాలను మించిపోయింది. జనవరి 29 న ఘోరమైన తొక్కిసలాట జరిగినప్పటికీ, ప్రతిరోజూ ఇక్కడికి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల నుండి మిలియన్ల మంది యాత్రికులు వస్తూనే ఉన్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ విశిష్ట మహా కుంభమేళా జనవరి 13 న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు త్రివేణి సంగమం - గంగా, యమునా మరియు హిందువులు పవిత్రంగా భావించే పౌరాణిక సరస్వతి నదుల సంగమం వద్ద ప్రజలు పుణ్య స్నానాలను ఆచరిస్తారు.

చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువ

మహా కుంభమేళాలో పాల్గొన్నవారి సంఖ్య భారత్, చైనా మినహా మిగతా అన్ని దేశాల జనాభాను మించిపోయిందని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ సనాతన ధర్మ పవిత్ర జలాల్లో స్నానం ఆచరించిన వారి కంటే తక్కువ జనాభాను కలిగి ఉన్నాయని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి ఐదు దేశాలు వరుసగా భారతదేశం, చైనా, యుఎస్, ఇండోనేషియా, పాకిస్తాన్. అమెరికాలో 34.20 కోట్లు, ఇండోనేషియాలో 28.36 కోట్ల మంది నివసిస్తున్నారు. పాకిస్తాన్ జనాభా సుమారు 25.70 కోట్లు. ఇది మహా కుంభమేళాకు హాజరైనవారిలో దాదాపు సగం.

అమృత ఫడ్నవీస్ పుణ్య స్నానం

శుక్రవారం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అమృత ఫడ్నవీస్ దంపతులు తమ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానాన్ని ఆచరించారు. ‘‘మాతో సహా 50 కోట్ల మందికి పైగా ప్రజలు మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇక్కడి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి’’ అని ఆమె అన్నారు.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.