Madras HC: అమెరికా పౌరుడితో పెళ్లి... వర్చువల్ వివాహనికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్-madras high court allows marriage of tamil nadu girl with us national through virtual mode ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Madras High Court Allows Marriage Of Tamil Nadu Girl With Us National Through Virtual Mode

Madras HC: అమెరికా పౌరుడితో పెళ్లి... వర్చువల్ వివాహనికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 06:47 AM IST

మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ కీలక తీర్పు ఇచ్చింది. వర్చవల్ పెళ్లికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

వర్చవల్ పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్( representative image)
వర్చవల్ పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్( representative image) (ANI)

madras high court allows virtual marriage: తమిళనాడుకు చెందిన వంశీ సుదర్శిని అనే అమ్మాయి, అమెరికాకు చెందిన రాహుల్‌ ఎల్‌ మధు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమెరికా పౌరసత్వం కలిగిన రాహుల్ ఎల్ మధు.. వివాహం చేసుకునేందుకు ఇండియాకు వచ్చాడు. వీరిద్దరూ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ పెళ్లి జరపలేదు. మరోవైపు పెళ్లి నిమిత్తం ఇండియాలో ఉండేందుకు తీసుకున్న అనుమతి గడువు ముగుస్తుండటంతో అబ్బాయి.. తిరిగి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమ్మాయి హైకోర్టును ఆశ్రయించింది. వర్చువల్‌ మ్యారేజ్‌కి పర్మిషన్‌ ఇవ్వాలని కోరింది.

ట్రెండింగ్ వార్తలు

‘ఈ వివాహనికి మా తల్లిదండ్రులు కూడా అనుమతి ఇచ్చారు. మేం ఇద్దరూ హిందూ మతానికి చెందిన వారిమే. ప్రత్యేక వివాహ చట్టం కింద మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ వివాహం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు పిటిషన్ లో అమ్మాయి’ పేర్కొంది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌… గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ముగ్గురు సాక్షుల సమక్షంలో వర్చువల్ వివాహనికి ఏర్పాట్లు చేయాలని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు. పిటిషనర్ కు రాహుల్ నుంచి పవర్ ఆఫ్ ఆటార్నీ ఉనందున్న వివాహ ధృవీకరణ పత్రం పుస్తకంలో ఆమె సంతకం పెట్టవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్