Freedom Fighter marriage : 103ఏళ్ల వయస్సులో.. మూడో పెళ్లి చేసుకున్న స్వాతంత్ర్య ఉద్యమకారుడు..
103 year old Freedom Fighter marriage : మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 103ఏళ్ల స్వాతంత్ర్య ఉద్యమకారుడు.. ఓ 49ఏళ్ల మహిళను మూడో పెళ్లి చేసుకున్నారు. దానికి గల కారణాలను వివరించారు.
Freedom Fighter marriage : ఓ 103ఏళ్ల స్వాతంత్ర్య సమర యోధుడు.. తన వయస్సులో సగం వయస్సు కూడా లేని ఓ మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే..
మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన హబీబ్ నజర్ అనే స్వాతంత్ర్య సమర యోధుడి వయస్సు 103ఏళ్లు. కాగా.. గతేడాది, 49ఏళ్ల ఫిరోజ్ జహాన్ అనే మహిళను ఆయన పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
హబీబ్ నజర్కి ఇది మూడో పెళ్లి. రెండో భార్య మరణం తర్వాత.. ఒంటరి వాడినైపోయానని హబీబ్ నజర్ తెలివారు.
ప్రస్తుతం బయటకు వచ్చిన వీడియోలో.. హబీబ్ నజర్, ఆయన భార్య కనిపిస్తున్నారు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వారు ఇంటికి వెళుతుండగా, ఆ వీడియో తీశారు. ఓ వ్యక్తి.. నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతుండటం వీడియోలో రికార్డ్ అయ్యింది. అదే సమయంలో.. హబీబ్ నజర్ కూడా.. తాను మూడో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను ప్రత్యక్షంగా చెప్పారు.
Madhya Pradesh Freedom Fighter marriage : "కిసీ చీజ్ కీ కమీ నహి హే. కమీ హమారే దిలోన్ మైన్ హే," అని 103ఏళ్ల స్వాతంత్ర్య సమర యోధుడు అన్నారు. 'నా జీ వితంలో ఎలాంటి లోటు లేదు. కానీ ఒంటరితనం నన్ను వెంటాడుతోంది,' అని దాని అర్థం.
హబీబ్ నజర్ మొదటి వివాహం.. మహారాష్ట్ర నాసిక్‌లో చోటుచేసుకుంది. రెండో పెళ్లి.. ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో జరిగింది.
"నా వయస్సు 103ఏళ్లు. నా భార్య వయస్సు 49ఏళ్లు. నా మొదటి పెళ్లి నాసిక్‌లో జరిగింది. ఆమె మరణించిన తర్వాత.. ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి ఇంకో పెళ్లి చేసుకున్నాను. రెండో భార్య కూడా మరణించింది. నేను ఒంటరితనంలోకి కూరుకుపోయాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకున్నాను," అని హబీబ్ నజర్ తెలిపారు.
Habib Nazar freedom fighter : కాగా.. ఫిరోజ్ జహాన్‌కి ఇది రెండో పెళ్లి. వివాహానికి ముందు వరకు.. ఆమె కూడా ఒంటరిగానే జీవించేవారు. 103ఏళ్ల స్వాతంత్ర్య సమర యోధుడిని చూసుకోవడానికి ఎవరు లేరన్న కారణంతో.. తాను పెళ్లికి ఒప్పుకున్నట్టు ఆమె తెలిపారు.
"నన్ను ఎవరు బలవంతం చేయలేదు. ఇది నా సొంత నిర్ణయం. నా భర్త ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు. మేము సంతోషంగా ఉంటాము," అని ఫిరోజ్ జహాన్ తెలిపారు.
సంబంధిత కథనం