Rare doctor honoured with Padma Shri: 20 రూపాయల డాక్టర్ కు పద్మ శ్రీ-madhya pradesh doctor who treats patients for 20 rupees honoured with padma shri ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rare Doctor Honoured With Padma Shri: 20 రూపాయల డాక్టర్ కు పద్మ శ్రీ

Rare doctor honoured with Padma Shri: 20 రూపాయల డాక్టర్ కు పద్మ శ్రీ

HT Telugu Desk HT Telugu
Published Jan 26, 2023 07:46 PM IST

Rare doctor honoured with Padma Shri: మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కు చెందిన డాక్టర్ ఎంసీ దావర్ (Dr MC Dawar) కు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ‘పద్మ శ్రీ’ (Padma Shri) ప్రకటించింది.

పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంసీ దావర్
పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంసీ దావర్

Rare doctor honoured with Padma Shri: డాక్టర్ ఎంసీ దావర్ (Dr MC Dawar). కొన్ని దశాబ్దాలుగా మధ్య ప్రదేశ్ లోని ప్రజలకు దాదాపు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. డాక్టర్ దావర్ అంటే అక్కడ ఎవరికీ తెలియదు. కానీ, 20 రూపాయల డాక్టర్ అంటే మాత్రం అంతా గౌరవ పూర్వకంగా గుర్తు పడ్తారు.

Rare doctor honoured with Padma Shri: 1972 లో రూ. 2 తో ప్రారంభించి..

డాక్టర్ ఎంసీ దావర్ (Dr MC Dawar) జబల్పూర్ లో 1972లో వైద్య సేవలను ప్రారంబించారు. అప్పుడు ఆయన పేషెంట్లను నుంచి నామమాత్రంగా రూ. 2 లను ఫీజుగా తీసుకునేవారు. ఇప్పుడు ఆయన వయస్సు 77 ఏళ్లు. ఇప్పటికీ, ఆ డాక్టర్ రోజుకు కనీసం 100 మంది పేషెంట్లను చూస్తారు. వారి వద్ద నుంచి కేవలం రూ. 20 మాత్రం కన్సల్టింగ్ ఫీ గా వసూలు చేస్తారు. డాక్టర్ దావర్ (Dr MC Dawar) సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బుధవారం భారత దేశ నాలుగో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మ శ్రీ’ని (Padma Shri) ఆయనకు ప్రకటించింది.

Rare doctor honoured with Padma Shri: ప్రజల రక్తం పీల్చవద్దు..

వైద్య శాస్త్రం అభ్యసిస్తున్న సమయంలో తనకు తన గురువుగారైన ఒక ప్రొఫెసర్ ఒక మాట చెప్పారని డాక్టర్ దావర్ (Dr MC Dawar) చెప్తారు. వైద్యం ఒక సేవలా చేయాలే కానీ, ప్రజల నుంచి రక్తం పీల్చడానికి వైద్యం చేయవద్దని ఆ ప్రొఫెసర్ తనకు బోధించారని వివరించారు. ‘ ఆ మాటలు నా జీవన గమనాన్ని ఒక మలుపు తిప్పాయి. అప్పటినుంచి నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలను అందించడం ప్రారంభించాను’ అని Dr MC Dawar వివరించారు.

Rare doctor honoured with Padma Shri: పాకిస్తాన్ లో జన్మించి..

డాక్టర్ దావర్ (Dr MC Dawar) 1946 లో పాకిస్తాన్ లో జన్మించారు. దేశ విభజన సమయంలో కుటుంబంతో పాటు భారత్ కు వచ్చి పాకిస్తాన్ లోని జలంధర్ లో స్థిరపడ్డారు. 1965లో జబల్పూర్ లో మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆర్మీలో జాయిన్ అయ్యారు. 1971 పాకిస్తాన్ తో యుద్ధం సమయంలో భారతీయ సైనికులకు వైద్య సేవలను అందించారు. ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, పేదలకు సేవ చేయడం కోసం జబల్పూర్ లో స్థిరపడ్డారు. 1972 లో రూ. 2 ను ఫీజు గా తీసుకోవడం ప్రారంభించారు. 1986 లో ఫీజును రూ. 3 కి పెంచారు. 1997 లో రూ. 5 కి, 2012 లో రూ. 10 కి, 2022 లో రూ. 20 కి ఫీజును పెంచారు. పద్మ శ్రీ (Padma Shri) ప్రకటించనున్నట్లు బుధవారం ఉదయం తెలిసిందని, ఎలాంటి లాబీయింగ్ లేకుండా పద్మశ్రీ (Padma Shri) రావడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ దావర్ వ్యాఖ్యానించారు.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.