మరణించిన ఉద్యోగి శవపేటికను మోసిన కంపెనీ ఛైర్మన్! ‘మనసున్న బిలియనీర్’..
లులూ గ్రూప్ ఛైర్మన్, బిలియనరీ యూసుఫ్ అలీ.. మరణించిన తన కంపెనీ ఉద్యోగి శవపేటికను మోశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వారానికి 70 గంటలు పనిచేయాలి, 90 గంటలు పనిచేయాలంటూ కంపెనీ ఓనర్లు, సీఈఓలు- ఎండీలు వార్తల్లో నిలుస్తున్న ఈ కాలంలో.. లులు గ్రూప్ ఛైర్మన్ హృదయాలను గెలుచుకుంటున్నారు! మరణించిన ఉద్యోగి శవపేటికను మోస్తున్న లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ. యూసుఫ్ అలీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
ఉద్యోగి శవపేటికను మోసిన కంపెనీ ఛైర్మన్..
ఎంఏ. యూసుఫ్ అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పుడు, ఇది ఒక లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వైరల్ వీడియో ప్రకారం.. షిహాబుద్దీన్ అనే వ్యక్తి అబుదాబిలోని అల్ వహ్దా మాల్ లులు హైపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేశాడు. ఆయన తిరుర్ కన్మనంకు చెందినవాడు. కాగా గుండెపోటు కారణంగా ఆయన ఇటీవలే మరణించాడు. ఫ్యూనరల్లో పాల్గొన్న యూసుఫ్.. తన ఉద్యోగి శవపేటికను మోశారు.
“గుండెపోటుతో మరణించిన అబుదాబి అల్ వహ్దా మాల్ లులు హైపర్ మార్కెట్ సూపర్వైజర్, తిరుర్ కన్మనంకు చెందిన షిహాబుద్దీన్ అంత్యక్రియలు జరిగాయి. అల్లాహ్ మాగ్ఫిరత్, మర్హమాత్‌తో అనుగ్రహించుగాక. ఆమెన్,” అని వైరల్ వీడియోలోని క్యాప్షన్ చెబుతోంది.
లులు గ్రూప్ చైర్మన్‌పై ప్రశంసల వర్షం..
మరణించిన ఉద్యోగి కోసం లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ. యూసుఫ్ అలీ చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి అపారమైన ప్రశంసలు లభించాయి.
“ఒక వ్యక్తి మరణించాడు. అతని మృతదేహం వద్ద ప్రార్థన చేయడానికి దేశంలోని అతిపెద్ద బిలియనీర్, కంపెనీ యజమాని వచ్చారు. ఇదే మానవత్వం,” అని ఒక యూజర్ అభిప్రాయపడ్డాడు.
"నిజమైన బాస్ అంటే ఇలా ఉండాలి — ఖచ్చితంగా అభినందనలు!" అని మరొకరు వ్యాఖ్యానించాడు.
“మరణించిన వ్యక్తి ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ, ఆయన సమాధి శాంతియుతంగా, ఆశీర్వాదాలతో నిండి ఉండాలని, దైవ కరుణ ఓదార్పు ఉండాలి,” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
మరొకరు షిహాబుద్దీన్‌ను అద్భుతమైన సూపర్జర్గా చెప్పుకొచ్చారు.
చాలా మంది నెటిజన్లు యూసుఫ్ అలీని రోల్ మోడల్‌గా ప్రశంసిస్తూ, ఆయన సానుభూతి, బాధ్యతాయుతమైన భావాన్ని ప్రశంసిస్తున్నారు.
లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ. యూసుఫ్ అలీ..
యూసుఫ్ అలీకి చెందిన లులు గ్రూప్ భారతదేశంలోని అనేక నగరాలతో పాటు యూఏఈలో 240 హైపర్ మార్కెట్లు, మాల్స్‌ను నడుపుతోంది. ఫోర్బ్స్ ప్రకారం.. యూసుఫ్ అళీ నికర విలువ $6.4 బిలియన్ (రూ. 55,000 కోట్లు) దాటింది!
లులు గ్రూప్ చైర్మన్‌కు భారీ అభిమానులు కూడా ఉన్నారు. ఆయన ఒకసారి తన అభిమాని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎఫ్ఫిన్‌కు రూ. 2 లక్షల విలువైన ఖరీదైన రాడో గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు.
సంబంధిత కథనం