New CDS: కొత్త సీడీఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్-lt gen anil chauhan appointed as new cds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Lt Gen Anil Chauhan Appointed As New Cds

New CDS: కొత్త సీడీఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 07:31 PM IST

New CDS: దాదాపు తొమ్మిది నెలల విరామం అనంతరం కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

లెఫ్ట్ నెంట్ జనరల్ అనిల్ చౌహాన్
లెఫ్ట్ నెంట్ జనరల్ అనిల్ చౌహాన్

New CDS: ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ను నియమించింది. 9 నెలల క్రితం నాటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

New CDS: కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)

తాజాగా, బుధవారం కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ను ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ను కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) గా నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ సీడీఎస్ గానే కాకుండా, కేంద్ర ప్రభుత్వ మిలటరీ వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తిస్తారు.

New CDS: 40 ఏళ్ల కెరియర్

లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ భారతీయ సైన్యంలోని వివిధ విభాగాల్లో దాదాపు 40 ఏళ్ల పాటు సేవలను అందించారు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను విజయవంతంగా అమలు చేశారు. దేశంలోని పలు మిలటరీ కేంద్రాల నిర్వహణలో పాలు పంచుకున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS). తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.