Rahul Gandhi drives tractor: ట్రాక్టర్ తో పొలం దున్ని.. నాట్లు వేసిన రాహుల్ గాంధీ-live news today 8th july 2023 national international business updates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Drives Tractor: ట్రాక్టర్ తో పొలం దున్ని.. నాట్లు వేసిన రాహుల్ గాంధీ

హరియాణాలోని ఒక పొలంలో నాట్లు వేస్తున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi drives tractor: ట్రాక్టర్ తో పొలం దున్ని.. నాట్లు వేసిన రాహుల్ గాంధీ

03:33 PM ISTJul 08, 2023 09:03 PM HT Telugu Desk
  • Share on Facebook
03:33 PM IST

  • Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్​, స్పోర్ట్స్​, ఎంటర్​టైన్​మెంట్​ వార్తల కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

Sat, 08 Jul 202303:33 PM IST

మధ్య ప్రదేశ్ లో మరో దారుణం; చెప్పుతో కొడుతూ.. బలవంతంగా పాదాలు నాకించుకున్న రాక్షసులు

ఒక వ్యక్తిని బలవంతంగా వాహనంలో తీసుకువెళ్తూ.. అతడిని చెప్పుతో కొడుతూ, అతడితో బలవంతంగా తమ పాదాలను నాకించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్వాలియర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sat, 08 Jul 202302:25 PM IST

ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు; లోతట్టు ప్రాంతాలు జలమయం; మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలే..

Delhi rains: ఢిల్లీ (Delhi) నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దేశ రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కనాట్ ప్లేస్, రవీంద్ర నగర్, వినోద్ నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు నగరమంతా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల రోడ్లపై మోకాళ్లోతున నీరు నిలిచింది. మింటో బ్రిడ్జ్ కింద నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Sat, 08 Jul 202312:27 PM IST

రాజస్తాన్ లోని కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

Kota suicides: రాజస్తాన్ లోని కోట (kota) లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈ, నీట్ శిక్షణకు ప్రసిద్ధి గాంచిన కోటలో ఒత్తిడికి తట్టుకోలేక విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

Sat, 08 Jul 202311:39 AM IST

కేరళలో ప్రాణాంతక ఇన్ఫెక్షన్; ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ సోకడంతో బాలుడి మృతి

కేరళలో మరో ప్రాణాంతక సమస్య ప్రారంభమైంది. ప్రమాదకరమైన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా (brain eating amoeba)’ ఇన్ఫెక్షన్ ను కేరళలో గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ తో అలపుజ్జా జిల్లాలో ఒక 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

Sat, 08 Jul 202311:08 AM IST

డీఆర్డీఓ సైంటిస్ట్ కు హనీ ట్రాప్; పాక్ సీక్రెట్ ఏజెంట్ కు రక్షణ శాఖ సీక్రెట్స్ వెల్లడి

DRDO scientist honeytrap: పుణెలోని డీఆర్డీఓ లో డైరెక్టర్ హోదాలో పనిచేసే 60 ఏళ్ల ప్రదీప్ కురుల్కర్ (Pradeep Kurulkar).. పాకిస్తాన్ కు చెందిన ఒక మహిళా సీక్రెట్ ఏజెంట్ వలలో (honeytrap) పడిపోయాడు. ఆ మహిళకు డీఆర్డీఓ కు సంబంధించిన కీలక క్షిపణి పరీక్షల వివరాలను, డ్రోన్స్ వివరాలను, రోబోటిక్ ప్రోగ్రామ్స్ వివరాలను వెల్లడించి, దేశ రక్షణను, సమగ్రతను ముప్పులో పడేశాడు.

Sat, 08 Jul 202310:27 AM IST

ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ ల భర్తీ

NMDC recruitment 2023: ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి జులై 18 ఆఖరు తేదీ. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

Sat, 08 Jul 202309:24 AM IST

రైలు ప్రయాణికులకు శుభవార్త.. 25 శాతం వరకు చార్జీల తగ్గింపు

ఏసీ సిట్టింగ్ సదుపాయం ఉన్న రైళ్లలో రైళ్లలో తగ్గింపు పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ రైల్వేలకు అప్పగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైళ్ల ఆక్యుపెన్సీని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏసీ చెయిర్ కార్, వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ల టికెట్ ధరలను 25 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించింది.

Sat, 08 Jul 202308:51 AM IST

Rahul Gandhi drives tractor: ట్రాక్టర్ తో పొలం దున్ని.. నాట్లు వేసిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ శనివారం ఉదయం షిమ్లా వెళ్తూ.. మార్గమధ్యంలో హరియాణాలోని సొనెపట్ జిల్లా మెదీనా గ్రామ శివార్లలో అకస్మాత్తుగా తను ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపివేసి, అక్కడి రైతులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద వరి నాటు వేయడం నేర్చుకున్నారు. ట్రాక్టర్ తో పొలం దున్ని, నాట్లు వేశారు. ఆ సమయంలో స్వల్పంగా వర్షం పడుతున్నప్పటికీ.. పట్టించుకోకుండా, ఆ వర్షంలోనే రైతులతో మమేకమయ్యారు. దాంతో, అక్కడి రైతులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు.