Live news today : ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ.. ఆ కేసుపై విచారణ
- Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి.
Mon, 03 Jul 202311:56 AM IST
దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది?
దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది? కొన్నాళ్లుగా ఎందుకు నిద్రపోవడం లేదు? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసి డిలీట్ చేయడం గమనార్హం.
Mon, 03 Jul 202311:43 AM IST
కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్
కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు టీమిండియా క్రికెటర్లు. క్రికెట్ పక్కన పెట్టి కాసేపు ఇలా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
Mon, 03 Jul 202311:13 AM IST
రూ.85 లక్షల డైమండ్ రింగ్ మాయం..!
చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ డైమండ్ రింగ్ ను చోరీ చేసిందో వైద్యురాలు. అనంతరం దొరికిపోతాననే భయంతో డాక్టర్ ఆ రింగ్ ను టాయ్ లెట్ కమోడ్ లో పడేసింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ డైమండ్ రింగ్ విలువ రూ. 85లక్షలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mon, 03 Jul 202310:54 AM IST
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 లాంచ్ నేడే..
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ నేడు ఇండియాలో లాంచ్కానుంది. హీరో మోటోకార్ప్‌తో కలిసి ఈ బైక్‌ను రూపొందించింది హార్లీ డేవిడ్సన్.
Mon, 03 Jul 202310:34 AM IST
ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ..
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ.. సోమవారం ఈడీ ఎదుట హాజరైనట్టు తెలుస్తోంది. ఫేమా కేసులో భాగంగా అధికారులు అనిల్ అంబానీని విచారించినట్టు సమాచారం.
Mon, 03 Jul 202310:16 AM IST
కౌంటీ క్రికెట్ ఆడనున్న పృథ్వీషా
విండీస్ టూర్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో తనకు స్థానం దక్కకపోవడంతో టీమ్ ఇండియా ప్లేయర్ పృథ్వీషా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కౌంటీ జట్టు నార్తంప్టన్‌షైర్‌తో పృథ్వీషా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దులీప్ ట్రోపీలో వెస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు పృథ్వీషా.
Mon, 03 Jul 202309:30 AM IST
అసోంలో దారుణం..
అసోంలో ఓ 16ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రేప్ చేయడమే కాకుండా, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలో పడేశాడు నిందితుడు!
Mon, 03 Jul 202309:07 AM IST
తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు
తెలంగాణ బీజేపీలో మార్పులు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది. దిల్లీ నుంచి బండి సంజయ్ పిలుపు రావడం, జితేందర్ రెడ్డి-ఈటల భేటీతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.
Mon, 03 Jul 202308:42 AM IST
ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి?
ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఎన్నికల రాజకీయాల కోసమే నేతలు దీనిని ఉపయోగించుకుంటున్నారా? లేక ఇది నిజంగానే ఇండియాకు అవసరం ఉందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mon, 03 Jul 202308:31 AM IST
రామ్ పాన్ ఇండియన్ మూవీ టైటిల్ ఫిక్స్
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌ను సోమవారం అనౌన్స్‌చేశారు. స్కంద అనే పేరును ఫిక్స్ చేశారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీకి భారతీయ పురాణాల్ని గుర్తుచేసేలా పవర్‌ఫుల్ టైటిల్‌ను ఎంపికచేయడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Mon, 03 Jul 202307:54 AM IST
సలార్ టీజర్ డేట్ ఫిక్స్..
సలార్ టీజర్ డేట్ ఫిక్స్ అయ్యింది. జులై 6 ఉదయం 5:30 గంటలకు టీజర్‌ను లాంచ్ చేయనున్నట్టు సినిమా బృందం వెల్లడించింది.
Mon, 03 Jul 202307:46 AM IST
ఎలివేట్ బుకింగ్స్ షురూ..
ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఎలివేట్‌కు సంబంధించి బుకింగ్స్‌ను తాజాగా ప్రారంభించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా. దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ డీలర్షిప్షోరూమ్స్లో సోమవారం నుంచి ఎలివేట్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ 'హోండా ఫ్రం హోం'లోనూ ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది.
Mon, 03 Jul 202306:37 AM IST
వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. వాహనాల ధరలను మళ్లీ పెంచాలని ఫిక్స్ అయ్యింది. ధరల పెంపు ఈ నెల 17 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్స్, వేరియంట్లపై సగటు 0.6శాతం ప్రైజ్ హైక్ తీసుకుంటున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరగనున్నట్టు స్పష్టం చేసింది
Mon, 03 Jul 202306:17 AM IST
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు
బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టను ప్రకటించింది. బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్ లకు మహిళల జట్టును అనౌన్స్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mon, 03 Jul 202305:49 AM IST
అజిత్ పవర్ ఎఫెక్ట్..
అజిత్ పవార్ ఎఫెక్ట్‌తో బెంగళూరు వేదికగా ఈ నెల 13, 14 తేదీల్లో జరగాల్సిన విపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల అనంతరం పార్టీల మధ్య భేటీ ఉండొచ్చని తెలుస్తోంది.
Mon, 03 Jul 202305:38 AM IST
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ రేపే..
భారీ అంచనాల మధ్య సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను మంగళవారం లాంచ్ చేయనుంది కియా మోటార్స్. దేశంలో కియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Mon, 03 Jul 202305:31 AM IST
నేడు కేంద్ర మంత్రి మండలి భేటీ..
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రి మండలి భేటీకానుంది. కేబినెట్ విస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Mon, 03 Jul 202305:15 AM IST
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్
అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. ఈ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
Mon, 03 Jul 202304:47 AM IST
నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 54,050కి చేరింది.
దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,190గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 71,900గా కొనసాగుతోంది.
Mon, 03 Jul 202304:40 AM IST
108 అంబులెన్స్‌లను ప్రారంభించనున్న సిఎం జగన్
ఏపీలో కొత్త 108 అంబులెన్స్ సేవల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 146 అంబులెన్స్‌లను తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.
Mon, 03 Jul 202304:29 AM IST
స్టాక్ మార్కెట్ ఓపెనింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో మొదలుపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగి 64832 వద్ద ఓపెన్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 19246 వద్ద ప్రారంభమైంది.
Mon, 03 Jul 202304:29 AM IST
ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం!
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది.
Mon, 03 Jul 202304:29 AM IST
'మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్..!'
మహారాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలపై శివసేన తన పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ, అజిత్ పవర్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. అదే సమయంలో ఏక్నాథ్ శిందేను సీఎం పదవి నుంచి తప్పించి.. అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్టు ఆరోపించింది.