Live news today : లైకా ప్రొడక్షన్స్​పై ఈడీ దాడులు..-live news today 16th may 2023 national international business news updates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today : లైకా ప్రొడక్షన్స్​పై ఈడీ దాడులు..

హెచ్​టీ తెలుగు లైవ్​ న్యూస్​(AP)

Live news today : లైకా ప్రొడక్షన్స్​పై ఈడీ దాడులు..

11:40 PM ISTMay 16, 2023 09:29 PM HT Telugu Desk
  • Share on Facebook
11:40 PM IST

  • Live news today : నేటి జాతీయ, బిజినెస్​, అంతర్జాతీయ వార్తల అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ బ్లాగ్​ను ఫాలో అవ్వండి.

Tue, 16 May 202303:59 PM IST

‘RRR’ centres in U.P.: యూపీలోని 11 నగరాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సెంటర్స్

‘RRR’ centres in U.P.: రాష్ట్రంలోని 11 నగరాల్లో ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాల నిర్వహణను స్వచ్ఛంధ సంస్థలకు, స్వయం సహాయక బృందాలకు అప్పగించాలని యోచిస్తోంది. ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ సామగ్రి.. మొదలైన వాటిని సేకరించి ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాల ద్వారా అవసరమైన వారికి అందిస్తారు. పౌరుల ఇళ్లల్లో నుంచి ఈ వస్తువులను సేకరించడానికి వాహనాలను సమకూరుస్తారు. ఆ ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్స్ ను తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ ఆర్ ఆర్ (RRR) లోని ఆస్కార్ పురస్కారాన్ని సాధించిన పాట నాటు నాటు (Natu Natu song) స్ఫూర్తితో ‘‘నా త్రో (Na Throw).. నా త్రో (Na Throw)’’ అనే పేరుతో వ్యవహరిస్తారు.

Tue, 16 May 202302:28 PM IST

Maruti Wagon R: 24 ఏళ్లలో 30 లక్షలు.. కార్ సేల్స్ లో వేగన్ ఆర్ రికార్డు

Maruti Wagon R: ఈ వేగన్ ఆర్ (Wagon R) కారును మారుతీ సంస్థ 1999లో తొలిసారి మార్కెట్లో ప్రవేశపెట్టింది. నాటి నుంచి 2023 వరకు కూడా ప్రతీ సంవత్సరం ఈ కారు అమ్మకాల్లో తొలి ఐదు స్థానాల్లో నిలుస్తోంది. 1999 నుంచి 2023 మార్చి వరకు మారుతి వేగన్ ఆర్ (Maruti Wagon R) కారు మొత్తం 30 లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఈ కారు తిరుగులేని అమ్మకాలను సొంతం చేసుకుంది.

Tue, 16 May 202301:51 PM IST

Bharti Airtel Q4 result: ఎయిర్ టెల్ లాభాల్లో 50 శాతం వృద్ధి; డివిడెండ్ ప్రకటన

Bharti Airtel Q4 result: భారత టెలీకాం దిగ్గజ సంస్థ భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) Q4FY23 లో రూ. 3,006 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY22 లో ఎయిర్ టెల్ నికర లాభాలు రూ. 2,008 కోట్లు. ఎయిర్ టెల్ (Bharti Airtel) Q4FY23 లో Q3FY23 తో పోలిస్తే, నికర లాభాల్లో 89% వృద్ధిని సాధించింది.

Tue, 16 May 202311:30 AM IST

IMD Monsoon prediction: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన; ఈ ఏడు సాధారణమే

IMD Monsoon prediction: రుతు పవనాల (Monsoon) రాకపై భారత వాతావరణ విభాగం (India Meteorological Department IMD) కీలక ప్రకటన చేసింది. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు (southwest monsoon) కేరళకు జూన్ 1వ తేదీ వరకు చేరుతాయి. ఈ సంవత్సరం అవి జూన్ 4 (model error of +/-4 days)వరకు కేరళకు వస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.

Tue, 16 May 202310:52 AM IST

Next BRS meeting in Maha: మహారాష్ట్రలో కేసీఆర్ తదుపరి మీటింగ్ చంద్ర పూర్ లో..

Next BRS meeting in Maharashtra: మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి (BRS) ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు (KCR) ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన మూడు బహిరంగ సభలు విజయవంతం కావడంతో, ఈ నెలాఖరులోగా మరో సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మే 19, మే 20 తేదీల్లో నాందేడ్ లో పార్టీ (BRS) కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ఉంటుందని, రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ఇద్దరు ప్రతినిధులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని బీఆర్ఎస్ (BRS) మహారాష్ట్ర కో ఆర్డినేటర్ ద్యానేశ్ వాకుడ్కర్ వెల్లడించారు.

Tue, 16 May 202309:39 AM IST

Karnataka politics: ఢిల్లీకి మారిన ‘‘కర్నాటకం’’.. రంగంలోకి రాహుల్ గాంధీ

Karnataka politics: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) ఘన విజయం అనంతరం.. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ లో దిగ్గజాల వంటి ఇద్దరు నాయకులు సిద్ధ రామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా పోటీ పడుతుంటే, వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియని సందిగ్ధంలో పార్టీ అగ్ర నాయకత్వం పడింది. రాష్ట్రంలో పార్టీ విజయానికి ఆ ఇద్దరు నాయకులు విశేష కృషి చేశారు. తమ ఆర్థిక వనరులను, శక్తి యుక్తులను, వ్యూహలను, అనుభవాన్ని ఉపయోగించి తిరిగి పార్టీకి ఘన విజయం అందించారు.

Tue, 16 May 202308:15 AM IST

ఇండియన్​ నేవీలో వేకెన్సీలు..

372 వేకెన్సీల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఇండియన్​ నేవీ. ఛార్జ్​మెన్​-2 పోస్టుల కోసం అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు అప్లికేషన్​ ప్రక్రియ కొనసాగనుంది.

Tue, 16 May 202308:04 AM IST

అమెరికాకు రాహుల్​ గాంధీ..

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ అమెరికాకు వెళ్లనున్నారు. మే 31 నుంచి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.

Tue, 16 May 202307:36 AM IST

లైకా ప్రొడక్షన్స్​పై ఈడీ దాడులు..

పొన్నియన్​ సెల్వన్​ 1-2 చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ కార్యాలయాల్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. చెన్నైలోని 8 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్​పై ఉన్న మనీలాండరింగ్​ కేసులో భాగంగా అధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Tue, 16 May 202307:12 AM IST

నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

ఇండియా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 155 పాయింట్లు కోల్పోయి 62,190 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 18,354 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Tue, 16 May 202306:31 AM IST

టయోటా యారిస్​ క్రాస్​ లాంచ్​..

సరికొత్త ఎస్​యూవీని అంతర్జాతీయ మార్కెట్​లో ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. దీని పేరు టయోటా యారిస్​ క్రాస్​.

Tue, 16 May 202305:46 AM IST

అమితాబ్, అనుష్కశర్మకు షాకిచ్చిన ముంబై పోలీసులు

బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు విరాట్ కోహ్లి స‌తీమ‌ణి, హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌కు ముంబై ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. సోమ‌వారం అమితాబ్‌బ‌చ్చ‌న్‌, అనుష్క శ‌ర్మ వేర్వేరు బైక్‌ల‌పై ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే హెల్మెట్ లేకుండా బైక్ ప్ర‌యాణం చేసినందుకు ఇద్ద‌రికీ ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధించారు.

Tue, 16 May 202304:58 AM IST

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం..!

భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు మరో చేదు వార్త! కేరళలోకి నైరుతి రుతుపవనాల రాక ఈ ఏడాది ఆలస్యమవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్​ తెలిపింది.

Tue, 16 May 202304:34 AM IST

స్కూల్​కు బాంబు బెదిరింపు..

దక్షిణ ఢిల్లీ పుష్ప్​ విహార్​లోని ఓ పాఠశాలకు బాంబు బెదింపు ఫోన్​ కాల్​ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అమృతా స్కూల్​ను ఖాళీచేయించారు. బాంబు స్క్వాడ్​ తనిఖీలు చేపట్టి.. ఎలాంటి ప్రమాదం లేదని తేల్చింది.

Tue, 16 May 202304:08 AM IST

ఢిల్లీకి శివకుమార్​..

కర్ణాటక తదుపరి సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​.. మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్​ పెద్దలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. మరో కీలక నేత సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.

Tue, 16 May 202303:48 AM IST

స్టాక్​ మార్కెట్​ న్యూస్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 32 పాయింట్ల నష్టంతో 62,314 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 4పాయింట్లు కోల్పోయి 18,395 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Tue, 16 May 202303:41 AM IST

శ్రీవారి భక్తులు..

మే 15న శ్రీవారిని దర్శించికున్న భక్తుల వివరాలు..

మొత్తం భక్తుల సంఖ్య - 70,366

హుండీ కానుకలు : 4.32 కోట్లు

ఎస్​ఎస్​డీ టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.

 

Tue, 16 May 202303:24 AM IST

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

Tue, 16 May 202303:24 AM IST

వాట్సాప్​ కొత్త ఫీచర్​..

వాట్సాప్​లో కొత్త ఫీచర్​ వచ్చింది. అదే ఛాట్​ లాక్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 16 May 202303:23 AM IST

బంగారం, వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,650గా ఉంది. దేశంలో వెండి ధరలు సైతం మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,480గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 74,800గా కొనసాగుతోంది.

Tue, 16 May 202303:22 AM IST

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలకు చేరింది. మంగళవారం నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉంది.