Lionel Messi detained : ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సీని అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు..!-lionel messi detained by chinese police at beijing airport reason revealed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lionel Messi Detained : ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సీని అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు..!

Lionel Messi detained : ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సీని అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు..!

Sharath Chitturi HT Telugu
Jun 12, 2023 04:50 PM IST

Lionel Messi detained : లియోనెల్​ మెస్సీని చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! బీజింగ్​ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

మెస్సీని అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు..!
మెస్సీని అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు..!

Lionel Messi detained : ఫుట్​బాల్​ దిగ్గజం లియోనెల్​ మెస్సీ అభిమానులకు షాకింగ్​ న్యూస్! బీజింగ్​ ఎయిర్​పోర్ట్​లో మెస్సీని చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెస్సీ పాస్​పోర్ట్​తో సమస్య తలెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

అసలేం జరిగింది..?

బీజింగ్​లోని వర్కర్స్​ స్టేడియంలో ఈ గురువారం ఆస్ట్రేలియాతో అర్జెంటీనా తలపడనుంది. ఇదొక ఇంటర్నేషనల్​ ఫ్రెండ్లీ మ్యాచ్​. ఇందులో భాగంగానే అర్జెంటీనా జట్టుతో మెస్సీ చైనాకు వెళ్లాడు. అయితే.. పాస్​పోర్ట్​ సమస్యతో అతడిని చైనా పోలీసులు ఎయిర్​పోర్ట్​లోనే అడ్డుకున్నట్టు తెలుస్తోంది. చైనా వీసా కోసం మెస్సీ అప్లై చేసుకోలేదని సమాచారం.

మెస్సీ వద్ద అర్జెంటీనాతో పాటు స్పానిష్​ పాస్​పోర్ట్​ కూడా ఉంది. స్పానిష్​ పాస్​పోర్ట్​ను అతను చైనాకు తీసుకెళ్లాడు. కానీ చైనాలో స్పానిష్​ పాస్​పోర్ట్​కు వీసా ఫ్రీ ఎంట్రీ లేదు. తైవాన్​లోనే స్పానిష్​ పాస్​పోర్ట్​తో వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. అయితే.. తైవాన్​ కూడా చైనాలో భాగమని మెస్సీ భావించినట్టు, అందుకే వీసాకు అప్లై చేసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Lionel Messi in China : మెస్సీతో చైనా పోలీసులు మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. తొలుత.. పోలీసులు, మెస్సీ మధ్య భాషపరంగా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. వేరే అధికారులు వచ్చి దానిని పరిష్కరించినట్టు సమాచారం. ఆ తర్వాత.. అధికారులు అర్జెంటీనా స్టార్​ ప్లేయర్​ మెస్సీకి ఎక్స్​పిడైటెడ్​​ వీసా (వేగంగా పొందే వీసా)ను మంజూరు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 30 నిమిషాల ఉత్కంఠ తర్వాత ఫుట్​బాల్​ ప్లేయర్​ను ఎయిర్​పోర్ట్​ బయటకు పంపించినట్టు చైనా మీడియా పేర్కొంది.

ఫలితంగా.. గురువారం మ్యాచ్​లో మెస్సీ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన మెస్సీ వీడియోను ఇక్కడ చూడండి :

మెస్సీ కోసం ఎదురుచూపులు..

మరోవైపు మెస్సీ ఆట కోసం చైనా అభిమానులు సన్నద్ధమవుతున్నారు. తమ అభిమాన ఫుట్​బాల్​ ఆటగాడు ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతాడా? తాము ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నారు.

Lionel Messi latest news : చైనాలో మ్యాచ్​ తర్వాత.. అర్జెంటీనా జట్టు జూన్​ 19న ఇండోనేషియాతో తలపడనుంది. ఇండోనేషియాలో ఈ మ్యాచ్​ జరగనుంది. ఆ తర్వాత మెస్సీకి కాస్త విరామం లభిస్తుంది.

సంబంధిత కథనం