Lightning deaths in India: పిడుగుపాటుకు ఇండియాలో ఎంతమంది చనిపోయారో తెలుసా?-lightning kills 907 in india as extreme weather surges in 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Lightning Kills 907 In India As Extreme Weather Surges In 2022

Lightning deaths in India: పిడుగుపాటుకు ఇండియాలో ఎంతమంది చనిపోయారో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 05:48 PM IST

Climate Change efects: వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా కరువులు, తుపాన్లు, భూకంపాలు, వేడి గాలులు, పిడుగుపాట్లు మొదలైన ప్రకృతి విపత్తుల సంఖ్య పెరుగుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Climate Change efects: ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. భారత్ లోనూ తుపానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Deaths due to Natural calamities: భారత్ లో..

గతమూడేళ్లతో పోలిస్తే.. ఈ సంవత్సరం పిడుగుపాట్లు, హీట్ వేవ్ ల కారణంగా ఇండియాలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సంవత్సరం భారత్ లో గరిష్టంగా 27 హీట్ వేవ్స్ సంభవించాయి. అలాగే, పిడుగుపాట్లు 111 సార్లు సంభవించాయి. ఈ వివరాలను బుధవారం ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించింది. 2022లో ఇప్పటివరకు మొత్తంగా 907 మంది పిడుగుపాటుకు బలి అయ్యారని వెల్లడించింది. అలాగే, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురియడం కూడా ఈ సంవత్సరం అత్యధికంగా 240 సార్లు సంభవించిందని వెల్లడించింది. ఈ ప్రకృతి విపత్తుల కారణంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 2,183 మంది చనిపోయారని, 2019 సంవత్సరం(3.017 మరణాలు) తరువాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమమని తెలిపింది. ఈ సంవత్సరం ఈ ప్రకృతి విపత్తుల మరణాల్లో దాదాపు 78% తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, పిడుగుపాట్ల వల్లనే సంభవించాయని తెలిపింది.

Climate Change efects: భవిష్యత్తులో మరింత ముప్పు

వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం రానున్న సంవత్సరాల్లో మరింత తీవ్రంగా ఉండనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హీట్ వేవ్స్, తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల సంఖ్య, వాటి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు ఒక శతాబ్దం తరువాత ఈ సంవత్సరం మార్చి నెల అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన మార్చి నెలగా రికార్డు సృష్టించింది. ఏప్రిల్, మే నెలల్లోనూ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. హీట్ వేవ్ కారణంగా 1998 నుంచి 2017 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 1.66 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

IPL_Entry_Point