Lic Policy lapse: ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ.. పాలసీదారులకు ఎల్ఐసీ ఉపశమనం-lic launches special campaign for policyholders to revive lapsed policies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Lic Launches Special Campaign For Policyholders To Revive Lapsed Policies

Lic Policy lapse: ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ.. పాలసీదారులకు ఎల్ఐసీ ఉపశమనం

HT Telugu Desk HT Telugu
Aug 17, 2022 11:24 AM IST

ఎల్ఐసీ బీమా పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఎల్ఐసీ తెలిపింది.

Over the weekend, the national insurer LIC had reported a manifold jump in June quarter net income at  ₹682.9 crore.
Over the weekend, the national insurer LIC had reported a manifold jump in June quarter net income at ₹682.9 crore. (Reuters)

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ల్యాప్స్ అయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఆగస్ట్ 17 నుండి అక్టోబర్ 21, 2022 వరకు ఉంటుంది. ఆలస్య రుసుములో చాలా ఆకర్షణీయమైన రాయితీలతో అన్ని నాన్-యులిప్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

అనివార్య పరిస్థితుల కారణంగా ప్రీమియంలు చెల్లించలేకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. పాలసీ ల్యాప్ అయిన పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది.

‘ఎల్ఐసీ పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది..’ అని ఎల్ఐసీ సంస్థ ట్వీట్ చేసింది.

యూలిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) మినహా అన్ని పాలసీలను పాలసీ షరతులకు లోబడి.. చెల్లించని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలలోపు పునరుద్ధరించవచ్చని ఎల్ఐసీ ప్రకటించింది.

మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు ఆలస్య రుసుం నుంచి 100 శాతం మినహాయింపు ఇస్తోంది.

ఎల్ఐసీ పాలసీదారులకు ఆలస్య రుసుము రాయితీలు

రూ. 1 లక్ష వరకు చెల్లించాల్సిన ప్రీమియం ఉంటే.. ఆలస్య రుసుములో 25 శాతం రాయితీని అందిస్తోంది. అయితే ఈ రాయితీ గరిష్ట పరిమితి రూ. 2,500గా ఎల్ఐసీ పేర్కొంది.

  • రూ. 1-3 లక్షల ప్రీమియం మొత్తానికి గరిష్ట రాయితీ రూ. 3,000.
  • అదేవిధంగా రూ. 3 లక్షలకు పైబడిన ప్రీమియం మొత్తానికి రూ. 3,500 గరిష్ట పరిమితితో 30 శాతం రాయితీ వర్తిస్తుంది.

కాగా ఎల్ఐసీ జూన్ త్రైమాసికంలో నికర ఆదాయం రూ. 682.9 కోట్లకు పెరిగిందని నివేదించింది. ఇది రికార్డు ప్రీమియం ఆదాయంతో సాధ్యమైంది. ఇది ఏడాది క్రితం కేవలం రూ. 2.94 కోట్లుగా ఉంది. తక్కువ మార్జిన్‌లను నివేదించినప్పటికీ లాభం పెరిగింది.

IPL_Entry_Point

టాపిక్