LIC IPO listing | 8శాతం నష్టాలతో ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​..-lic ipo listing news shares debut at 8percent discount ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Lic Ipo Listing News, Shares Debut At 8percent Discount

LIC IPO listing | 8శాతం నష్టాలతో ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​..

HT Telugu Desk HT Telugu
May 17, 2022 10:06 AM IST

LIC IPO listing | ఎల్​ఐసీ ఐపీఓ భారత స్టాక్​ మార్కెట్​లో మంగళవారం లిస్ట్​ అయ్యింది. ఊహించినట్టుగానే ఎల్​ఐసీ ఐపీఓ నష్టాల్లో లిస్ట్​ అయ్యింది.

భారత స్టాక్​మార్కెట్​లో ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​
భారత స్టాక్​మార్కెట్​లో ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​ (REUTERS)

LIC IPO listing | ఎల్​ఐసీ ఐపీఓ షేర్లు మంగళవారం స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయ్యాయి. అందరు ఊహించినట్టుగానే ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​ నష్టాల్లో జరిగింది. కేంద్రం ఐపీఓ అలాట్​మెంట్ ప్రైజ్​ను​ రూ. 949గా నిర్ణయించగా.. ఎల్​ఐసీ షేర్లు ఎన్​ఎస్​ఈలో రూ. 872గాను, బీఎస్​ఈలో రూ. 867.2గాను లిస్ట్​ అయ్యాయి. అప్పర్​ ప్రైజ్​బ్యాండు కన్నా ఇది 8శాతం నష్టం.

ట్రెండింగ్ వార్తలు

కాగా.. పాలసీహోల్డర్లకు రూ. 889(రూ. 45 డిస్కౌంట్​), రిటైలర్లకు రూ. 904(రూ. 60 డిస్కౌంట్​)లో షేర్లను సబ్​స్క్రైబ్​ చేసుకోవడంతో వారికి నష్టాలు 8శాతం కన్నా తక్కువగానే ఉన్నాయి.

LIC share price | మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న అనిశ్చితుల కారణంగా ఎల్​ఐసీ ఐపీఓ ఫ్లాట్​గా, లేదా స్వల్ప నష్టాల్లో లిస్ట్​ అవుతుందని, గత కొంతకాలంగా విశ్లేషకులు అంచనాలు వేస్తూ వచ్చారు. ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం సైతం ఇదే సూచించింది.

ఎల్​ఐసీలో 100శాతం వాటా కలిగిన కేంద్రం.. ఐపీఓ ద్వారా.. 3.5శాతాన్ని విక్రయించింది. మొత్తం మీద 22.13కోట్ల షేర్లను విక్రయించి రూ. 21,000కోట్లను సమీకరించింది.

ఎల్​ఐసీ ఐపీఓకు పాలసీదారులు, డీఐఐలు, రిటైలర్ల నుంచి భారీ స్పందన లభించింది. కానీ ఎఫ్​ఐఐలు మాత్రం ఐపీఓకు దూరంగానే ఉండిపోయారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్