LIC share price : ఎల్​ఐసీతో మదుపర్లకు రూ. 1.5లక్షల కోట్ల నష్టం!-lic investors lose rs 1 49 lakh crore after listing is there more pain ahead ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Lic Investors Lose Rs 1.49 Lakh Crore After Listing. Is There More Pain Ahead?

LIC share price : ఎల్​ఐసీతో మదుపర్లకు రూ. 1.5లక్షల కోట్ల నష్టం!

Sharath Chitturi HT Telugu
Jun 10, 2022 01:03 PM IST

LIC share price : లిస్టింగ్​ డే నుంచి ఎల్​ఐసీ షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. ఈ పతనం ఇంకా కొనసాగుతుందని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎల్​ఐసీతో మదుపర్లకు భారీ నష్టం!
ఎల్​ఐసీతో మదుపర్లకు భారీ నష్టం! (REUTERS)

LIC share price : ఎన్నో అంచనాలతో మార్కెట్​లోకి అడుగుపెట్టిన ఎల్​ఐసీ.. అందుకు తగ్గట్టుగా రాణించలేకపోతోందా? ఈ స్టాక్​.. మదుపర్లకు ఓ పీడకలగా మిగిలిపోనుందా? ఎల్​ఐసీ స్టాక్​ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఈ భయాలు నిజమయ్యేడట్టే కనిపిస్తోంది. ఎల్​ఐసీలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు.. లిస్టింగ్​ డే నాటి నుంచి ఇప్పటివరకు రూ. 1.49లక్షల కోట్ల నష్టం వాటిల్లింది!

ట్రెండింగ్ వార్తలు

దాదాపు ఏడాది కాలం పాటు వాయిదా పడిన ఎల్​ఐసీ ఐపీఓ.. రూ. 949 ప్రైజ్​ బ్యాండ్​తో మార్కెట్​లోకి వచ్చింది. కానీ దాని లిస్టింగ్​ మాత్రం రూ. 872 వద్ద జరిగింది. అప్పటికే మదుపర్లకు 8శాతం నష్టం కలిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎల్​ఐసీ షేర్లు.. రూ. 949ను ఒక్కసారి కూడా తాకలేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు భారీగానే పడింది. ప్రస్తుతం ఎల్​ఐసీ స్టాక్​ రూ. 712 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఈ పరిణామాలతో.. ఎల్​ఐసీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 6లక్షల కోట్ల నుంచి సుమారు రూ. 4.51లక్షల కోట్లకు దిగొచ్చింది. ఫలితంగా మదుపర్లకు దాదాపు రూ. 1.5లక్షల కోట్ల నష్టాన్ని కలిగించింది ఎల్​ఐసీ.

ఇంకా పడుతుందా?

ఎల్​ఐసీ యాంకర్​ ఇన్వెస్టర్ల లాకిన్​ పీరియడ్ త్వరలో​ ముగియనుంది. ఈ లెక్కన చూసుకుంటే.. ఎల్​ఐసీ షేర్లు మరింత పడతాయని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా.. ప్రస్తుత మార్కెట్​ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎఫ్​ఐఐలు ఇంకా అమ్మకాలవైపే ఉన్నారని, ఎల్​ఐసీ షేర్లను కొనేందుకు వారు ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. మరోవైపు ఎల్​ఐసీ క్యూ4 ఫలితాలు కూడా అంత ప్రభావితంగా లేవని అంటున్నారు. మరో 2-3 త్రైమాసిక ఫలితాలు కూడా ఇదే విధంగా ఉండొచ్చని, అది ఎల్​ఐసీ షేర్ల మీద ప్రతికూల ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు.

"ఎల్​ఐసీ ఐపీఓ సమయంలో రిటైలర్లే ఎక్కువమంది పాల్గొన్నారు. అందువల్ల ఇప్పుడు వాళ్లు కూడా షేర్లు కొనుగోలు చేయడం లేదు. చార్ట్​ను పరిశీలిస్తే ఎల్​ఐసీ బలహీనంగానే కనిపిస్తోంది. రూ. 680 వరకు కూడా పడే అవకాశం ఉంది," అని ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​కు చెందిన అనూజ్​ గుప్తా వెల్లడించారు.

(గమనిక: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి చేసే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం)

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్