Telugu News  /  National International  /  Lic Housing Fin, Bajaj Housing Fin Hike Lending Rates By 0.50 Pc
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపనున్న వడ్డీ రేట్లు
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపనున్న వడ్డీ రేట్లు (REUTERS)

Home loans interest rates hike: హోం లోన్లపై అర శాతం వడ్డీ రేటు పెంచిన సంస్థలు

22 August 2022, 17:00 ISTHT Telugu Desk
22 August 2022, 17:00 IST

Home loans interest rates hike: హోం లోన్లపై ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అర శాతం వడ్డీ రేటు పెంచాయి.

ముంబై, ఆగస్టు 22: మార్టిగేజ్ రుణదాతలు బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై వడ్డీ రేట్లను 0.50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి.

ట్రెండింగ్ వార్తలు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ తన కీలక రుణ రేటును మే నుంచి 1.40 శాతం పెంచిన నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్నాయి. ఆ క్రమంలో తాజాగా ఈ రెండు హౌజింగ్ లోన్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచేశాయి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తన వడ్డీ రేటును 0.50 శాతం పెంచింది. శాలరీ ఆదాయం, ప్రొఫెషనల్ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు ఇప్పుడు అతి తక్కువ గా వడ్డీ రేటు 7.70 శాతంగా ఉంటుంది. తాజాగా పెంపు ఉన్నప్పటికీ, కంపెనీ తన పోటీదారులతో పోలిస్తే తక్కువ రేట్లకే రుణాలను అందజేస్తున్నట్లు పేర్కొంది.

ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ తన ప్రైమ్ లెండింగ్ రేటు (ఎల్‌హెచ్‌పిఎల్‌ఆర్)ని 0.50 శాతం పెంచింది. గృహ రుణాలపై కొత్త వడ్డీ రేట్లు గతంలో 7.50 శాతం ఉండగా.. ఇప్పుడు 8 శాతం నుండి ప్రారంభమవుతాయి.

రెపో రేటును 0.50 శాతం పెంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల నెలవారీ వాయిదాలు లేదా గృహ రుణాల కాల వ్యవధిలో "కనీస హెచ్చుతగ్గులు" ఏర్పడనున్నాయి. అయినప్పటికీ గృహాలకు డిమాండ్ బలంగా ఉంటుందన్న విశ్వాసాన్ని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ వై.విశ్వనాథ గౌడ్ తెలిపారు.

కాగా వడ్డీ రేట్ల పెరుగుదలతో ఇటీవలికాలంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర ముఖ్య నగరాల్లో రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. ఒకవైపు ఆస్తి విలువ పెరగడం, మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో కొనుగోలుదారులు వెనక్కితగ్గగా.. తాజాగా వడ్డీ రేట్లు పెరగడంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్లు బిక్కమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ ఉందన్న కారణంతో నగర శివార్లతో సైతం పెద్దపెద్ద బిల్డర్ సంస్థలు చదరపు అడుగుకు రూ. 6 వేల వరకు వసూలు చేయడంతో రియల్ ఎస్టేట్ ప్రభావితమయ్యేలా కనిపిస్తోంది.