LeT terrorist: ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ అరెస్ట్; అతడు రిటైర్డ్ ఆర్మీ జవాను కూడా..-let terrorist who is a retired army personnel held in delhi railway station ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Let Terrorist: ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ అరెస్ట్; అతడు రిటైర్డ్ ఆర్మీ జవాను కూడా..

LeT terrorist: ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ అరెస్ట్; అతడు రిటైర్డ్ ఆర్మీ జవాను కూడా..

HT Telugu Desk HT Telugu
Feb 06, 2024 04:20 PM IST

LeT terrorist held in Delhi: ఢిల్లీలో మంగళవారం లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. లష్కరే తోయిబా క్రియాశీల సభ్యుడిగా ఉన్న రియాజ్ అహ్మద్ రాథర్ అనే వ్యక్తిని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రిటైర్డ్ ఆర్మీ జవాను కావడం గమనార్హం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

LeT terrorist: లష్కరే తోయిబా ఉగ్రవాది, రిటైర్డ్ ఆర్మీ జవాను అయిన రియాజ్ అహ్మద్ రాథర్ ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్ లోని కుప్వారా రియాజ్ అహ్మద్ రాథర్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి, పాకిస్తాన్ నుంచి వచ్చే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భారత్ లోకి చేరవేయడంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులైన ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గులాం సర్వార్ రాథర్ లతో కలిసి పాకిస్తాన్ నుంచి వచ్చే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నియంత్రణ రేఖ ద్వారా భారత్ లోకి రియాజ్ అహ్మద్ రాథర్ తీసుకువచ్చేవాడని వెల్లడించారు.

yearly horoscope entry point

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో..

ఇటీవల జమ్ముకశ్మీర్ లోని దర్యాప్తు సంస్థలు ఒక ఉగ్రవాద కుట్రను చేధించారు. ఆ సందర్భంగా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు ఏకే రైఫిల్స్ (షార్ట్), ఐదు ఏకే మ్యాగజైన్లు, 16 షార్ట్ ఏకే రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి వచ్చిన సమాచార ప్రకారం లష్కరే తోయిబాలో రియాజ్ అహ్మద్ రాథర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. దాంతో, వారు వెంటనే ఢిల్లీలోని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించారు. వారికి, రియాజ్ పరారీలో ఉన్నాడని తెలిసింది. అలాగే, అతడు మంగళవారం తెల్లవారు జామున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు వస్తాడని కూడా సమాచారం అందింది. దాంతో, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మోహరించారు. తెల్లవారుజామున ఎగ్జిట్ గేట్ నంబర్-1 నుంచి పారిపోయేందుకు యత్నిస్తుండగా రియాజ్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పీఓకే నుంచి..

రియాజ్ అహ్మద్ రాథర్ కు ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాదులు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్, ఖాజీ మొహమ్మద్ ఖుషాల్ పంపించేవారు. వీరిద్దరూ నియంత్రణ రేఖ సరిహద్దు వెంబడి లష్కరే తోయిబా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. రియాజ్, అతని స్నేహితుడు అల్తాఫ్ 2023 జనవరి 31న భారత సైన్యం నుంచి రిటైర్ అయ్యారు. రియాజ్ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.