Wed, 24 May 202304:19 PM IST
LIC Q4 results: ఎల్ఐసీ నికర లాభాల్లో దాదాపు 450% వృద్ధి; ఆదానీ షేర్ల ర్యాలీ ఫలితం
ఈ Q4FY23 లో LIC రూ. 13,190.79 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది LIC Q4FY22 లో ఆర్జించిన నికర లాభాల కన్నా 447.47% అధికం. Q4FY22 లో ఎల్ఐసీ సాధించిన నికర లాభాలు కేవలం రూ. 2,409.39 కోట్లు మాత్రమే. అలాగే Q3FY23 లో కన్నా Q4FY23 లో ఎల్ఐసీ 107.77% అధికంగా నికర లాభాలను ఆర్జించింది.
Wed, 24 May 202303:16 PM IST
ఆన్ లైన్ గేమింగ్ సంస్థలపై ఈడీ దాడులు; భారీగా నగదు స్వాధీనం
ED raids on online gaming firms: ఆన్ లైన్ లో గేమ్స్ నిర్వహిస్తున్న వెబ్ సైట్స్, కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ ల్లోని 25 లోకేషన్లలో ఈ దాడులు చేశారు. ముఖ్యంగా విదేశాల్లో రిజిస్టర్ అయి, భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు, వెబ్ సైట్స్ ఆర్థిక లావాదేవీల్లోని అవకతవకలు లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహించారు
Wed, 24 May 202301:19 PM IST
UAE consulate in Hyderabad: హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్; జూన్ 14న ప్రారంభం
UAE consulate in Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త. భారత్ లో మరో కాన్సులేట్ ను ప్రారంభించబోతున్నట్లు, దాన్ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయబోతున్నట్లు భారత్ లో యూఏఈ కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్నైమి వెల్లడించారు.
Wed, 24 May 202311:32 AM IST
JioFiber's affordable data plans: ఇది చాలా చవకగా లభించే జియో ఫైబర్ డేటా ప్లాన్
ఈ ప్లాన్ రూ. 1197 లకు లభిస్తుంది. వ్యాలిడిటీ 90 రోజులు. అంటే 30 రోజులకు రూ. 399. జీఎస్టీ అదనం. ఇందులో అప్ లోడ్ కు, డౌన్ లోడ్ కు 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ కూడా ఫ్రీ. ఈ ప్లాన్ లో ఒక్కో నెలకు గరిష్టంగా 3.3 టీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి రీచార్జ్ చేసుకోవాలి. అయితే, ఈ ప్లాన్ తో ఎలాంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ లభించవు. ఒక వేళ ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కావాలనుకుంటే వేరే ప్లాన్ కు వెళ్లవచ్చు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కూడా ఇచ్చే ప్లాన్స్ లో రూ. 2997 ప్లాన్ ముఖ్యమైనది.
Wed, 24 May 202309:54 AM IST
Gautam Adani: టాప్ 20 ప్రపంచ సంపన్నుల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ
Gautam Adani back in top 20 billionaires list: ఒకప్పుడు ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానంలో నిలిచి, ఒక వెలుగు వెలిగిన భారతీయ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ.. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆ సంపన్నుల జాబితా నుంచి కిందకు దిగజారారు. ఇప్పుడు ఆదానీ షేర్ల దూకుడుతో మళ్లీ టాప్ 20 సంపన్నుల్లో ఒకరయ్యారు.
Wed, 24 May 202309:09 AM IST
What is Sengol?: పార్లమెంట్ కొత్త భవనంలోకి చేరబోతున్న ఈ ‘రాజ దండం’ ప్రత్యేకత ఏంటి?
What is Sengol?: తమిళ రాచరిక సంస్కృతిలో భాగమైన ‘సెంగోల్ (Sengol)’ లేదా ‘రాజ దండం’ నూతన పార్లమెంటు భవనంలోకి చేరబోతోంది. లోక్ సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో ఈ రాజదండాన్ని ప్రత్యేకంగా అమర్చనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు.
Wed, 24 May 202308:47 AM IST
పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించకూడదు: ఎంఐఎంఐ చీఫ్
రాజ్యంగ నిబంధనల ప్రకారం పార్లమెంటు నూతన భవవాన్ని ప్రధాని మోదీ ప్రారంభించకూడదని ఎంఐఎంఐ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పార్లమెంటు భవవాన్ని ప్రారంభించే అధికారం లోక్‍సభ స్పీకర్‌కే ఉంటుందని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా.. ప్రారంభిస్తేనే తాము కార్యక్రమానికి హాజరువుతామని ఆయన అన్నారు.
Wed, 24 May 202308:16 AM IST
ఉద్ధవ్ థాక్రేను కలిసిన కేజ్రీవాల్
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కేంద్రం పార్లమెంటు ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తీసుకొస్తే వ్యతిరేకించాలని థాక్రేను కేజ్రీవాల్ కోరారు.
Wed, 24 May 202307:30 AM IST
ఆ అధికారం సీఎందే: డీకే శివకుమార్
క్యాబినెట్ విస్తరణ అధికారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యదేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. పార్టీ హైకమాండ్ ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చిందని చెప్పారు. ఆ విషయంపై సీఎంనే అడగాలని రిపోర్టర్లకు సూచించారు.
Wed, 24 May 202307:00 AM IST
ఫ్లాట్‍గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో సాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 15.15 పాయింట్ల నష్టంతో 18,332.85 వద్ద, సెన్సెక్స్ 15 పాయింట్లు కోల్పోయి 61,966.79 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Wed, 24 May 202306:25 AM IST
పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్షాలు దూరం
పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరుకాబోమంటూ దేశంలోని 19 పార్టీలు జాయింట్ స్టేట్‍మెంట్ విడుదల చేశాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహా మొత్తంగా 19 విపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 28వ తేదీన పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Wed, 24 May 202305:45 AM IST
దేశ జీడీపీ 7 శాతం దాటొచ్చు: ఆర్బీఐ గవర్నర్
2023 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7 శాతం కంటే ఎక్కువ నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
Wed, 24 May 202305:09 AM IST
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వెళ్లం
పార్లమెంటు నూతన భవన ప్రారంభ కార్యక్రమానికి తాము వెళ్లబోమని బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
Wed, 24 May 202304:15 AM IST
ప్రపంచం మరో మహమ్మరికి సిద్ధంగా ఉండాలి
ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెడ్ ట్రెడోస్ అథనోమ్. కొవిడ్-19 కంటే అది ఇంకా ప్రమాదకరంగా ఉండొచ్చని అంచనా వేశారు,
Wed, 24 May 202303:55 AM IST
నష్టాలతో స్టాక్ మార్కెట్లు ఓపెన్
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెషన్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 197.82 పాయింట్లు పడిపోయి 61,783.97 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 59.20 పాయింట్లు నష్టపోయి 18,288.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Wed, 24 May 202303:55 AM IST
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనెస్‍తో నేడు మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతం, వ్యాపారం, పెట్టుబడులు, రెన్యూవబుల్ ఎనర్జీ సహా అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ఆస్ట్రేలియాలో ఇటీవల హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల విషయంపై కూడా మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని వద్ద ప్రస్తావించారు. ఈ విషయంపై తాము చర్యలు తీసుకుంటామని అల్బనీస్ అన్నారు.
Wed, 24 May 202303:55 AM IST
మరింత తగ్గిన బంగారం ధర
దేశీయ మార్కెట్‍లో బంగారం ధర మరింత దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.290 తగ్గి రూ.56,000కు, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.310 తగ్గి రూ.61,100కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.