KVS Recruitment 2022: 13,404 పోస్టులకు నోటిఫికేషన్.. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు-kvs recruitment 2022 notifications released for 13404 posts in kendriya vidyalaya ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kvs Recruitment 2022 Notifications Released For 13404 Posts In Kendriya Vidyalaya

KVS Recruitment 2022: 13,404 పోస్టులకు నోటిఫికేషన్.. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 29, 2022 06:58 PM IST

KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya) 13,404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలు, ఎంపిక ప్రక్రియ సహా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 13,404 పోస్టులకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (Kendriya Vidyalaya Sangathan - KVS) నోటిఫికేషన్ వెలువరించింది. టీజీటీ (TGT), పీజీటీ (PGT), పీఆర్‌టీ (PRT), ప్రిన్సిపాల్‍తో పాటు నాన్ టీచింగ్ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

KVS Recruitment 2022: వివరాలు

  • డిపార్ట్‌మెంట్: కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS)
  • ఖాళీల సంఖ్య: 13,404 పోస్టులు (టీచింగ్, నాన్ టీచింగ్)
  • అప్లికేషన్ విధానం: ఆన్‍లైన్
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 5, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 26, 2022
  • అధికారిక వెబ్‍సైట్: kvsangathan.nic.in

KVS Recruitment 2022: ఖాళీల వివరాలు

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): 1,409
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 3,176
  • ప్రైమరీ టీచర్ (PRT): 6,414
  • ప్రిన్సిపాల్: 239
  • వైస్ ప్రిన్సిపాల్: 203
  • అసిస్టెంట్ కమిషనర్: 52
  • పీఆర్‌టీ (మ్యూజిక్): 303
  • లైబ్రరేరియన్: 355
  • ఫైనాన్స్ ఆఫీసర్: 6
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 2
  • అసిస్టెంట్ సెలెక్షన్ ఆఫీసర్ (ASO) : 156
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (UDC): 322
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (LDC): 702
  • హిందీ ట్రాన్స్ లేటర్: 11
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II: 54
  • మొత్తం ఖాళీల సంఖ్య: 13,404

KVS Recruitment 2022: వయోపరిమితి

పీజీటీ: 40 సంవత్సరాలు మించకూడదు

టీజీటీ/లైబ్రేరియన్: 35 సంవత్సరాలు మించకూడదు

పీఆర్ టీ: 30 సంవత్సరాలు మించకూడదు

KVS Recruitment 2022: అప్లికేషన్ ఫీజ్

యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.750, ప్రిన్సిపాల్ పోస్టులకు:1,200

ఎస్‍సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: ఉచితం

పేమెంట్ మోడ్: ఆన్‍లైన్

KVS Recruitment 2022: దరఖాస్తు ప్రక్రియ

  • ముందుగా కేవీఎస్ అఫీషియల్ వెబ్‍సైట్ kvsangathan.nic.in కు వెళ్లాలి.
  • KVS Teaching & Non-Teaching 2022 వేకెన్సీ లింగ్‍పై క్లిక్ చేయాలి
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వివరాలు ఫిల్ చేయాలి. ఫొటో, సిగ్నేచర్ అప్‍లోడ్ చేయాలి.
  • ఆ తర్వాత ఆన్‍లైన్ అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.
  • పూర్తయ్యాక అప్లికేషన్‍ను డౌన్‍లోడ్ చేసుకోవాలి.

KVS Recruitment 2022: ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

WhatsApp channel