BJP's ‘chalo Nabanna’ turns violent: రణరంగంగా కోల్ కతా..
BJP's ‘chalo Nabanna’ turns violent: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా మంగళవారం రణరంగంగా మారింది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఇచ్చిన చలో సెక్రటేరియట్(Nabanna Obhijan) పిలుపు ఉద్రిక్తంగా మారింది.
BJP's ‘chalo Nabanna’ turns violent: బీజేపీ ఇచ్చిన చలో సెక్రటేరియట్ పిలుపునకు బీజేపీ శ్రేణుల నుంచి భారీ స్పందన లభించింది. దాదాపు ఏడు ప్రత్యేక రైళ్లలో బీజేపీ కార్యకర్తలు కోల్ కతాకు తరలివచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
BJP's ‘chalo Nabanna’ turns violent: యుద్ధభూమి
Kolkata లో ఉన్న రాష్ట్ర సెక్రటేరియట్ కు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను హౌరా స్టేషన్ దగ్గరలో పోలీసులు అడ్డుకున్నారు. ఇనుప కంచెలు, బారికేడ్లు పెట్టి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తల వైపు నుంచి పోలీసుల పైకి రాళ్ల వర్షం మొదలైంది. ఒక్కసారిగా రాళ్లు, ఇటుకలు, కర్రలను పోలీసుల పైకి విసిరారు. పోలీసుల పైకి గ్లాస్ బాటిళ్లను కూడా విసిరారు. దాంతో, పోలీసులు లాఠీ ఛార్జి ప్రారంభించారు. వాటర్ కెనన్లతో బీజేపీ శ్రేణులను చెల్లాచెదురు చేశారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
BJP's ‘chalo Nabanna’ turns violent: వేరే ప్రాంతాల్లోనూ..
హౌరా స్టేషన్ సహా సెక్రటేరియట్ కు దారి తీసే పలు మార్గాల్లోనూ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. వివిధ మార్గాల ద్వారా సెక్రటేరియట్ కు చేరుకోవాలన్న బీజేపీ కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని నిలువరించడంతో, బీజేపీ కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దాంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనన్లను ఉపయోగించారు. పలు ప్రాంతాల్లో అందోళనకారులు కొన్ని పోలీసు వాహనాలను, కొన్ని ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. మరి కొన్నింటిని అగ్నికి ఆహుతి చేశారు. సంత్రాఘచ్చి, లాల్ బజార్, హౌరా, ఎంజీ రోడ్ .. తదితర ప్రాంతాలు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో రణరంగాలుగా మారాయి.
BJP's ‘chalo Nabanna’ turns violent: పోలీసుల అదుపులో బీజేపీ నేతలు..
ఈ ఉద్రిక్తత నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుకంతా ముజుందార్, అగ్నిమిత్ర పౌల్, సుదేంద్ర అధికారి, లాకెట్ చటర్జీ, రాహుల్ సిన్హా తదితర నేతలను, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో బీజేపీ నేతలు స్వపన్ దాస్ గుప్తా, మీనాదేవీ పురోహిత్ తదితరులు గాయపడ్డారు. తనపై మహిళా కానిస్టేబుల్ దాడి చేసిందని బీజేపీ నేత సుదేంధు అధికారి ఆరోపించారు.