పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్-know who is jyoti malhotra youtuber instagrammer arrested for allegedly spying for pakistan check in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్

Anand Sai HT Telugu

భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెుత్తం ఆరుగురిలో మహిళా యూట్యూబర్ ఒకరు.

యూట్యూబర్ అరెస్ట్

ర్యానాలోని హిసార్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టు అయింది. 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన జ్యోతికి 3,77,000 మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్యం నెట్‌వర్క్‌లపై జరుగుతున్న దర్యాప్తులో జ్యోతి ఇప్పుడు కీలకంగా మారింది.

ఐదు రోజుల రిమాండ్

గూఢచర్యం, సున్నితమైన భారత సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు చేరవేశారనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆమెకు ఐదు రోజుల పోలీసు రిమాండ్ విధించింది. హర్యానాలో మెుత్తం ఆరుగురిని గూఢచర్యం కేసులో అదుపులోకి తీసుకున్నారు.

అతడితో పరిచయం

జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్. పాక్‌లో చాలాసార్లు పర్యటించింది. టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి యాప్స్‌తో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చెరవేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ ప్రకారం మల్హోత్రా 2023లో న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-యువర్-రహీమ్ అలియాస్ డానిష్‌తో పరిచయం పెంచుకుంది. డానిష్ తన హ్యాండ్లర్‌గా వ్యవహరించాడని, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లకు పరిచయం చేశాడని, ఎన్ క్రిప్టెడ్ ప్లాట్ ఫామ్ ద్వారా నిరంతరం కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

పాకిస్థాన్‌కు రెండుసార్లు

జ్యోతి మల్హోత్రా 2023లో రెండుసార్లు పాకిస్థాన్‌లో పర్యటించి అలీ ఎహ్వాన్, షకీర్, రాణా షాబాజ్ వంటి ఉగ్రవాదులతో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. అనుమానం రాకుండా ఉండేందుకు వారి నంబర్లను వేర్వేరు పేర్లతో సేవ్ చేసుకుంది. ఆ తర్వాత బాలికి ఇంటెలిజెన్స్ ఏజెంట్‌తో కలిసి వెళ్లింది.

మల్హోత్రా హర్యానా, పంజాబ్‌లలో చురుకుగా ఉన్న పెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌లో భాగమని తెలుస్తోంది. గూఢచర్యం, సున్నితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, పాక్ హ్యాండ్లర్లకు ఆర్థిక, లాజిస్టిక్ సపోర్ట్ అందించడం వంటి ఆరోపణలతో తాజాగా ఆమెతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.