How to get car pollution certificate online : ఆన్​లైన్​లో పొల్యూషన్​ సర్టిఫికెట్​ పొందడం ఎలా?-know how to get a car pollution certificate online ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Know How To Get A Car Pollution Certificate Online

How to get car pollution certificate online : ఆన్​లైన్​లో పొల్యూషన్​ సర్టిఫికెట్​ పొందడం ఎలా?

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 11:23 AM IST

How to get a car pollution certificate online : మీ కారు పొల్యూషన్​ సర్టిఫికెట్​ను ఆన్​లైన్​లో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఆ వివరాలు..

ఆన్​లైన్​లో పొల్యూషన్​ సర్టిఫికెట్​ పొందడం ఎలా?
ఆన్​లైన్​లో పొల్యూషన్​ సర్టిఫికెట్​ పొందడం ఎలా? (HT_PRINT)

How to get a car pollution certificate online in telugu : వాయు కాలుష్యంతో పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. వాహనాలకు పొల్యూషన్​ టెస్టింగ్​ ఉంటుంది. అది చెక్​ చేసి.. సంబంధిత వాహనం రోడ్డు మీద తిరిగేందుకు అర్హత ఉందా? లేదా? అన్నది నిర్ణయిస్తారు. కారుకు ఈ పొల్యూషన్​ సర్టిఫికెట్​ ఉండటం అవసరం. ఈ పొల్యూషన్​ సర్టిఫికేట్​ను ఆఫ్​లైన్​లోనే కాకుండా ఆన్​లైన్​లో కూడా పొందవచ్చు. పీయూసీ సెంటర్లు లేదా ఆర్​టీఓ అఫీసులు.. ఆన్​లైన్​లో పొల్యూషన్​ సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

ఆన్​లైన్​లో పొల్యూషన్​ సర్టిఫికెట్​ పొందడం ఎలా అంటే..

Pollution certificate online : మీ కారును ముందుగా స్థానిక పీయూసీ సెంటర్​కు తీసుకెళ్లండి. చెకింగ్​ చేయించండి.

పీయూసీ అధికారి.. మీ కారు ఎక్సాస్ట్​ పైప్​ని పరిశీలించి.. వాహనం నుంచి వెలువడుతున్న ఉద్గారాల స్థాయిని పరీక్షిస్తాడు.

పీయూసీ కేంద్రంలో ఈ సర్వీసు కోసం పేమెంట్​ చేయాల్సి ఉంటుంది.

Parivahan Seva వెబ్​సైట్​కి వెళ్లాలి. మీ పీయూసీ సర్టిఫికెట్​ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.

ఆ కాపీని డౌన్​లోడ్​ చేసకుని మీ కారు పేపర్స్​తో పాటు పెట్టుకోండి.

ఆన్​లైన్​లో ఆర్టీఓ సేవలు..

RTO services online : దేశవ్యాప్తంగా 58 ట్రాన్స్‌పోర్ట్‌ సేవలు పౌరులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ 58రకాల సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవల కోసం రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం కల్పించింది. ఇంటి నుంచి ప్రజలు తమ పనుల్ని పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. ట్రాన్స్‌పోర్ట్‌ సేవల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించిన నోటిఫికేషన్‌ శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. లెర్నర్‌ లైసెన్స్‌ దరఖాస్తు, ఎల్‌ఎల్‌ఆర్‌లో మార్పులు, చేర్పులు, డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యూవల్‌‌తో పాటు మార్పులు చేర్పులు కూడా ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్