Lockdown stories | బోరు కొట్టి విమానం త‌యారు చేశాడు..-kerala man builds aircraft from scratch during lockdown ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kerala Man Builds Aircraft From Scratch During Lockdown

Lockdown stories | బోరు కొట్టి విమానం త‌యారు చేశాడు..

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 10:21 PM IST

Lockdown stories | లాక్‌డౌన్ స‌మ‌యంలో అంద‌రు వివిధ ర‌కాలుగా టైమ్ పాస్ చేశారు. కుటుంబంతో క్వాలిటీ టైమ్ గ‌డ‌ప‌డం, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడ‌డం, వ‌ర్క్ ఫ్రం హోం మొద‌లైన దిన‌చ‌ర్య‌తో లాక్‌డౌన్ కాలాన్ని ముగించారు.

అశోక్ త‌యారు చేసుకున్న విమానం
అశోక్ త‌యారు చేసుకున్న విమానం

Lockdown stories | కానీ, యూకేలో ఉంటున్న ఈ కేర‌ళ వ్య‌క్తి మాత్రం వినూత్నంగా త‌న లాక్‌డౌన్ కాలాన్ని గ‌డిపాడు. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఏకంగా సొంతంగా ఒక చిన్న విమానాన్నే త‌యారు చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Lockdown stories | నాలుగు సీట‌ర్ల విమానం

కేర‌ళ‌లోని అల‌ప్పుజ‌కు చెందిన అశోక్ అలిసెరిల్ త‌మ‌ర‌క్ష‌న్ ఒక మెకానిక‌ల్‌ ఇంజినీర్‌. 2006లో యూకేకి వెళ్లి, భార్య‌, ఇద్ద‌రు కూతుళ్ల‌తో అక్క‌డే సెటిల్ అయ్యాడు. అశోక్ తండ్రి కేర‌ళలో మాజీ ఎమ్మెల్యే ఏవీ త‌మ‌రాక్ష‌న్‌. ప్ర‌స్తుతం అశోక్ త‌మ‌ర‌క్ష‌న్ బ్రిట‌న్‌లో ఫోర్డ్ కంపెనీలో ప‌ని చేస్తున్నారు.

Lockdown stories | 2018లో లైసెన్స్‌

చిన్న విమానాలు న‌డిపేందుకు 2018లో అశోక్ త‌మ‌ర‌క్ష‌న్ లైసెన్స్ సంపాదించాడు. అప్ప‌టినుంచి అప్పుడుప్పుడు రెండు సీట్ల విమానాన్ని రెంట్‌కు తీసుకుని విహార‌యాత్ర‌ల‌కు వెళ్లేవాడు. కానీ త‌న కుటుంబ స‌భ్యుల సంఖ్య నాలుగు. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో రెండు సీట్ల విమానంలో విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌లేడు. నాలుగు సీట్ల విమానాలు రెంట్‌కు అందుబాటులో లేవు. ఉన్నా, చాలా ఓల్డ్ విమానాలు అవి.

Lockdown stories | లాక్‌డౌన్ స‌మ‌యం..

అదే స‌మ‌యంలో యూకేలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. అప్ప‌డే అశోక్ త‌మ‌ర‌క్ష‌న్ కు ఒక ఆలోచ‌న వ‌చ్చింది. సొంతంగా ఒక నాలుగు సీట్ల విమానాన్ని త‌యారు చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ద‌క్షిణాఫ్రికాలోని జోహెన్న‌స్‌బర్గ్‌లోని ఒక కంపెనీ కొత్త‌గా నాలుగు సీట్ల `Sling TSI` విమానాన్ని లాంచ్ చేయ‌నుంద‌నే సమాచారం తెలిసింది. వెంటనే అక్క‌డికి వెళ్లాడు. కావాల్సిన సరంజామాను ఆర్డ‌ర్ ఇచ్చివ‌చ్చాడు.

Lockdown stories | ఇంటి వెనుకే..

త‌ను ఉంటున్న ఇంటి వెనుక‌నే ఒక వ‌ర్క్‌షాప్ ప్రారంభించాడు. అక్క‌డే నాలుగు సీట్ల విమానాన్ని త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. స్థానిక సివిల్ ఏవియేష‌న్ అధికారులు ఈ ప్ర‌యోగాన్ని ప‌ర్య‌వేక్షించారు. దాదాపు 18 నెల‌ల తరువాత విజ‌య‌వంతంగా విమానాన్ని రూపొందించాడు. అందుకు ఆయ‌న‌కు దాదాపు రూ. 1.8 కోట్లు ఖ‌ర్చ‌య్యాయి. మొద‌ట‌, ఆ విమానంపై ఒంట‌రిగా టెస్ట్ డ్రైవ్ చేశాడు. త‌రువాత‌, ఇప్పుడు ఫ్యామిలీతో క‌లిసి హాయిగా యూకేలో, యూరోప్‌లో విహరిస్తున్నాడు.

IPL_Entry_Point