Kerala rape case : కూతురిని గర్భవతి చేసిన తండ్రికి.. మూడు జీవిత ఖైదులు-kerala court sentences man to three life terms for raping impregnating daughter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kerala Court Sentences Man To Three Life Terms For Raping, Impregnating Daughter

Kerala rape case : కూతురిని గర్భవతి చేసిన తండ్రికి.. మూడు జీవిత ఖైదులు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 31, 2023 07:56 AM IST

Man rapes daughter : తండ్రి చేతిలో అత్యాచారానికి గురై, గర్భం దాల్చిన ఓ బాలికకు న్యాయం జరిగింది. ఆ కిరాతక తండ్రికి మూడు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కేరళలోని ఓ కోర్టు.

కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. మూడు జీవిత ఖైదులు
కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. మూడు జీవిత ఖైదులు

Man rapes daughter : సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతక తండ్రికి కఠిన శిక్ష పడింది! అతడికి మూడు జీవిత ఖైదులు విధిస్తూ తీర్పునిచ్చింది కేరళలోని ఓ కోర్టు.

ట్రెండింగ్ వార్తలు

బెడ్​రూమ్​లోకి ఈడ్చుకెళ్లి..!

మార్చ్​ 2021లో తొలిసారిగా జరిగింది ఈ ఘటన. కొవిడ్​ సంక్షోభం నేపథ్యంలో 15ఏళ్ల బాలిక స్కూలుకు వెళ్లలేకపోయింది. ఇంట్లో నుంచే ఆన్​లైన్​ క్లాసులకు హాజరైంది. కాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ తండ్రి.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చదువుకుంటున్న బాలికను.. తన బెడ్​రూమ్​లోకి ఈడ్చుకెళ్లి రేప్​ చేశాడు. బాలిక ప్రతిఘటించగా.. 'నీ తల్లిని చంపేస్తాను,' అని బెదిరించాడు ఆ కిరాతకుడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి.. తన కూతురుని అనేకమార్లు రేప్​ చేశాడు. 2021 అక్టోబర్​ వరకు ఇది కొనసాగింది.

Kerala rape case : అదే ఏడాది నవంబర్​లో స్కూళ్లు తెరుచుకున్నాయి. బాలిక స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టింది. కానీ కడుపులో నొప్పి వస్తోందని ఫిర్యాదు చేసేది. ఆమెను డాక్టర్​ దగ్గరకు తీసుకెళ్లారు. అంతా బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కానీ కడుపు నొప్పితో 2022 జనవరిలో మరోమారు వైద్యుడి దగ్గరకు వెళ్లింది ఆ బాలిక. అప్పుడే షాకింగ్​ విషయం బయటకొచ్చింది.

ఆ బాలిక గర్భవతి అని తేలింది. ఎవరు చేశారు ఈ పని? అని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. 'నా తండ్రే నన్ను రేప్​ చేసి.. గర్భవతిని చేశాడు' అని ఆమె చెప్పగా.. అందరు షాక్​కు గురయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబసభ్యులు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. తండ్రీ, కూతుళ్ల నుంచి డీఎన్​ఏ శాంపిల్స్​ను సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్​కు తరలించారు. బాలిక నిజమే చెబుతోందని డీఎన్​ఏ పరీక్షలో తేలింది.

కఠిన శిక్ష అమలు..

Man sentenced to three life terms : డీఎన్​ఏ పరీక్షలు, బాలిక- ఆమె తల్లి స్టేట్​మెంట్స్​ ఆధారంగా.. పోలీసులు కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన మంజేరీ ఫాస్ట్​ ట్రాక్​ స్పెషల్​ కోర్టు జడ్జీ కే రాజేశ్​.. నిందితుడికి కఠినమైన శిక్షను విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. అతనికి మూడు జీవిత ఖైదులు వేస్తున్నట్టు స్పష్టం చేశారు. మిగిలిన జీవితాన్ని అతను జైలులోనే గడపాలని ఆదేశించారు. అంతేకాకుండా.. నిందితుడికి రూ. 6.6లక్షల జరిమానా సైతం విధించారు.

"విచారణను అత్యంత వేగంగా పూర్తిచేశాము. నిందితుడు.. బాధితురాలు, ఆమె తల్లిని బెదిరించకుండా చూసుకున్నాము," అని కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం