Ban on mayonnaise: ఎగ్ తో చేసే మయోనీస్ పై నిషేధం-kerala bans egg based mayonnaise and food parcels to carry production date best before stickers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kerala Bans Egg-based Mayonnaise And Food Parcels To Carry Production Date, Best Before Stickers

Ban on mayonnaise: ఎగ్ తో చేసే మయోనీస్ పై నిషేధం

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 08:40 PM IST

కేరళ ప్రభుత్వం గుడ్డుతో చేసే మయోనీస్(mayonnaise)పై నిషేధం విధించింది. ఇటీవల రాష్ట్రంలో విషాహార ఘటనలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గుడ్డుతో చేసే మయోనీస్ (mayonnaise)పై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. బదులుగా వెజిటబుల్ ఆయిల్ తో చేసే మయోనీస్ వాడాలని సూచించింది. అలాగే, అన్ని ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ పై తయారీ డేట్, బెస్ట్ బిఫోర్ డేట్ లను ముద్రించాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Ban on mayonnaise: విషాహారంతో మృతి

ఇటీవల కేరళలో పలు విషాహార ఘటనలు చోటు చేసుకున్నాయి. కొట్టాయంలోని ఒక నర్సు అరబిక్ ఫుడ్ ఐటమ్ అల్ ఫామ్ ను తిన్న తరువాత తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విషాహారం తీసుకోవడం వల్లనే ఆమె చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే, గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్రంలో 20కి పైగా విషాహారంతో అస్వస్థతకు గురైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు కఠిన నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది.

Ban on mayonnaise: మయోనీస్ తో ముప్పు

ఎగ్ వైట్ తో తయారు చేసే మయోనీస్ (mayonnaise) వల్ల ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు. మయోనీస్ (mayonnaise) ను ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా వాడుతారు. బర్గర్, పీజా, ఫ్రెంచ్ ఫ్రైస్, స్యాండ్ విచెస్, తందూరీ ఐటమ్స్ లో ఎక్కువగా వాడుతారు. ఎగ్ వైట్ వాడడం వల్ల ఇది త్వరగా పాడైపోతుంది. దాంతో అది విషంగా మారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇటీవల చాలా విషాహార ఘటనలకు మయోనీస్ (mayonnaise) నే కారణమని తేలింది. అలాగే, సరిగ్గా ఉడకని గుడ్లలో సాల్మొనెల్లా అనే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దాంతో, ఎగ్ తో తయారయ్యే మయోనీస్ (mayonnaise) ను అన్ని హోటెళ్లు, ఫుడ్ జాయింట్స్, దాభాల్లో నిషేధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. బదులుగా, వెజిటబుల్ ఆయిల్ తో చేసే మయోనీస్ వాడాలని సూచించింది.

hygiene rating app: పరిశుభ్రత ముఖ్యం

కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి గురువారం రాష్ట్ర హోటెల్స్, బేకరీస్, కేటరర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారంతా కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఇకపై క్రమం తప్పకుండా హోటెళ్లపై దాడులు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పరిశుభ్రత (hygiene), నాణ్యత (QUALITY)లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. త్వరలో హైజీన్ రేటింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. హోటళ్లు, బేకరీలు, దాభాల్లో పనిచేసే వారికి కచ్చితంగా హెల్త్ కార్డులు ఉండాలని సూచించారు. హోటెళ్లు, ఫుడ్ జాయింట్స్ పై దాడులు చేయడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి త్వరలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

IPL_Entry_Point

టాపిక్